Blakrishna : ‘అన్‌స్టాప‌బుల్‌’ షో కోసం బాలయ్య ఆహా అనిపించే పారితోషికం

బాలయ్య యాంకరింగ్ చేస్తున్నారు అంటే అందరికి ఆశ్చర్యంగానే ఉంది. ఆహ ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో చేయబోతున్నారు. 'అన్‌స్టాప‌బుల్‌' పేరుతో ఈ షో రాబోతుంది. దీనికి సంబంధించిన

Blakrishna : ‘అన్‌స్టాప‌బుల్‌’ షో కోసం బాలయ్య ఆహా అనిపించే పారితోషికం

Blakrishna :  బాలయ్య యాంకరింగ్ చేస్తున్నారు అంటే అందరికి ఆశ్చర్యంగానే ఉంది. ఆహ ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో చేయబోతున్నారు. ‘అన్‌స్టాప‌బుల్‌’ పేరుతో ఈ షో రాబోతుంది. దీనికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ కూడా నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ డ్యాన్స్ తో పాటు స్పీచ్ కూడా అదరగొట్టారు. చాలా మంది సెలబ్రిటీ లని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తాను అని చెప్పారు. అల్లు అరవింద్ బాల‌కృష్ణ‌ ను యాంకరింగ్ చేయడానికి ఒప్పించడానికి చాలానే కష్టపడి ఉంటాడు అని అభిమానులు అనుకుంటున్నారు. బాలయ్య యాంకరింగ్ చూడటానికి అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ షోని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నారు. నవంబర్ 4 నుంచి ఆహాలో ఈ షో టెలికాస్ట్ అవ్వనుందని తెలిపారు.

Vijay Devarakonda : అభిమానులకి వరాలు కురిపించిన విజయ్ దేవరకొండ

ఇక ఈ ‘అన్‌స్టాప‌బుల్‌’ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే తీసుకుంటున్నారని సమాచారం. అల్లు అరవింద్ ఖర్చుకి వెనకాడకుండా ఆహ ఓటిటిని తెలుగులో మిగిలిన అన్ని ఓటిటిలకి ధీటుగా నిలబెడుతున్నారు. ఇప్పటికి ఆహలో చాలా షోలు, సిరీస్ లు, సినిమాలు వస్తున్నాయి. వీటికోసం చాలానే ఖర్చు పెడుతున్నారు. ఇక ముందు మరిన్ని షోలు కూడా రాబోతున్నాయి అని అల్లు అరవింద్ తెలిపారు. బాలయ్యతో యాంకరింగ్, అది కూడా వేరే స్టార్ సెలెబ్రిటీలని తీసుకొచ్చి టాక్ షో అంటే మామూలు విషయం కాదు. భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అల్లు అరవింద్ అండ్ ఆహా టీం బాగానే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. బాలయ్య బాబుకి ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 40 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. మొదటి సీజన్ 12 ఎపిసోడ్స్‌తో ప్లాన్ చేయబోతున్నారు. అంటే ఈ సీజన్ మొత్తానికి కలిపి దాదాపు 5 కోట్ల వరకు అందుకుంటున్నాడు బాలయ్య. ఇక షోకి వచ్చే స్టార్ల కోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నారో. ఖర్చు ఎలా ఉన్నా అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం వెయిట్ చేయడం చూస్తుంటే ఈ షో బాగా హిట్ అయి ఆహాకి మరింత ప్లస్ అవుతుందని అనిపిస్తుంది.