Wife of the Year : కళ్లకు గంతలు కట్టినా.. భర్తను ఎలా గుర్తించింది?
కళ్లకు గంతలు కడితే భార్యాభర్తలు ఒకరినొకరు గుర్తించడం ఈజీనా? ఓ పోటీలో మహిళ తన భర్తను ఈజీగా కనిపెట్టేసింది. ఎలా సాధ్యమైందో తెలిస్తే మీకు నవ్వు వస్తుంది.

Wife of the Year
woman viral video : ప్రేమించిన వ్యక్తిని కళ్లకు గంతలు కట్టినా గుర్తించగలరు అంటారు.. ఓ పోటీలో మహిళ కళ్లకు గంతలు కట్టినా తన భర్తను గుర్తించగలిగింది. సరదాగా సాగిన ఈ పోటీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
ఓ సరదా పోటీకి సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కళ్లకు గంతలు కడతారు..వరుసగా నిలబడి ఉన్న పురుషుల్లో తన భర్త ఎవరన్నది భార్య గుర్తించాలి. కష్టమైన ఆట కదా. కానీ ఓ మహిళ సునాయాసంగా తన భర్త ఎవరో కనిపెట్టేసింది. ఎందుకంటే ఆమె భర్త తన కంటే ఎత్తు తక్కువ ఉంటాడు. అదే బేస్ చేసుకుని ఆమె తన భర్తని గుర్తుపట్టేసింది. పోటీ స్టార్ట్ కాగానే తన హైట్‌కి ఒక్కొక్కరినీ కొలుచుకుంటూ వెళ్లి ఆఖరున తన కంటే హైట్ తక్కువగా ఉన్న వ్యక్తిని తన భర్తగా గుర్తించగలిగింది.
Priyanka Chopra : నేను, నా భర్త పెళ్ళికి ముందు చాలా మందితో డేటింగ్ చేశాం.. కానీ గతం అనవసరం..
until_the_next_meme అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ‘ఆంటీ అక్కడ ఉన్న భార్యలందరికీ గట్టి పోటీ ఇచ్చింది’ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యింది. ‘ఇదే నిజమైన ప్రేమ’ అని.. ‘ఎత్తును బట్టి గుర్తించగలిగింది.. కానీ ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు’ అని కామెంట్లు పెట్టారు. నిజానికి హైట్ తక్కువగా ఉండటం వల్ల ఆమె వెంటనే తన భర్తను గుర్తించగలిగింది. పోటీలో హైట్ తక్కువ ఉన్న ఇద్దరు, ముగ్గురు పురుషులు ఉండి ఉంటే పోటీలో ఆమె అంచనా వేరేగా ఉండేదేమో?
View this post on Instagram