Congress Twitter Account: కేజీఎఫ్-2 మ్యూజిక్ వాడిన ఫలితం.. కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలంటూ కోర్టు ఆదేశం

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఒక వీడియోకు బ్యాగ్రౌండ్‌లో ‘కేజీఎఫ్-2’ మ్యూజిక్ వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై ఆ చిత్ర మ్యూజిక్ హక్కులు పొందిన ఆడియో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Congress Twitter Account: కేజీఎఫ్-2 మ్యూజిక్ వాడిన ఫలితం.. కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలంటూ కోర్టు ఆదేశం

Congress Twitter Account: అనుమతి లేకుండా ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాట వాడుకున్నందుకుగాను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఒక వీడియోకు బ్యాగ్రౌండ్‌లో ‘కేజీఎఫ్-2’ మ్యూజిక్ వాడుకున్నారు.

Nilgai-Tiger: నిల్గాయ్-పులి మధ్య హైడ్ అండ్ సీక్ ఆట.. పులికి నిల్గాయ్ చిక్కిందా.. చివరికి ఏం జరిగిందో చూడండి

దీనిపై ‘కేజీఎఫ్-2’ చిత్ర మ్యూజిక్ హక్కులు పొందిన ‘ఎమ్ఆర్‌టీ మ్యూజిక్’ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా మ్యూజిక్ ఎలా వాడుకుంటారు అంటూ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. రాహుల్ గాంధీతోపాటు, ఆ పార్టీ సీనియర్ నేతలైన జైరామ్ రమేశ్, సుప్రియా శ్రీనాతెను ప్రతివాదులుగా చేరుస్తూ కోర్టును ఆశ్రయించింది. సంస్థకు చెందిన ఎమ్.నవీన్ కుమార్ ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై బెంగళూరు కోర్టు సోమవారం విచారణ జరిపింది.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కోర్టు గుర్తించింది. దీంతో ‘కేజీఎఫ్-2’ మ్యూజిక్ ఉన్న వీడియో పోస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.