Meru International School: మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

స్కూల్ డైరెక్టర్ మేఘనా రావు జూపల్లి మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం మేరు విద్యాసంస్థ ఆలోచిస్తుందని, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈ తరాన్ని శక్తిమంతంగా మార్చాలనే మై హోమ్ గ్రూప్ సంస్థ ఆశయాల నుంచే రక్తదాన శిబిరం ఆలోచన వచ్చిందన్నారు.

Meru International School: మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Meru

Meru International School: హైదరాబాద్‌లోని, చందానగర్‌లో ఉన్న మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీతో కలిపి స్కూల్ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని 10, 11, 12వ తరగతులకు చెందిన విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమంలో దాతల నుంచి 53 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మరోవైపు విద్యార్థులకు రక్తదానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ మేఘనా రావు జూపల్లి మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం మేరు విద్యాసంస్థ ఆలోచిస్తుందని, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈ తరాన్ని శక్తిమంతంగా మార్చాలనే మై హోమ్ గ్రూప్ సంస్థ ఆశయాల నుంచే రక్తదాన శిబిరం ఆలోచన వచ్చిందన్నారు.

Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

‘‘ఇలాంటి కార్యక్రమాల వల్ల రక్తదానంపై సామాన్య ప్రజల్లో అవగాహన కలుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలి’’ అని మేఘనా రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రటరీ, సీఈవో కె.మదన్ మోహన్ రావు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డా.రెడ్డి, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు ఎస్.ప్రశాంత్, ఎస్.నరసింహ రెడ్డి పాల్గొన్నారు.