సోనూ సూద్‌పై బీఎంసీ ఫిర్యాదు..

సోనూ సూద్‌పై బీఎంసీ ఫిర్యాదు..

sonu-sood1

Sonu Sood: లాక్‌‌డౌన్ సమయంలో ఎంతోమందిని ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూ సూద్.. ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ హెల్పింగ్ హ్యాండ్ అనిపించుకుంటున్నారు.. తాజాగా ఆయనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కేసు పెట్టింది..

జూహూ ప్రాంతంలో ఆరు అంతస్తుల నివాస భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా సోనూ సూద్ హోటల్‌గా మార్చారని ఆరోపించారు. మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ నిబంధనలను సోనూ సూద్ ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.

BMC

కాగా బీఎంసీ వ్యాఖ్యలను సోనూ కొట్టిపారేశారు.. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే హోటల్‌గా మార్చానని అన్నారు. నివాస భవనాన్ని హోటల్‌గా మార్చేందుకు బీఎంసీ నుంచి ఛేంజ్ ఆఫ్ యూజర్ అనుమతులు తీసుకున్నానని, తాను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, ఒక్క మహారాష్ట్ర కోస్టల్ జోన్ నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందని స్పష్టం చేశారు సోనూ సూద్..