Bobby Kataria: విమానంలో స్మోకింగ్.. వామ్మో ఏందిది..!!

స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో ఓ వ్యక్తి పడుకుని స్మోక్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వ్యక్తిపై స్పందించిన సదరు ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ యాక్షన్ తీసుకుంది. అతను 15రోజుల పాటు ఆ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు వీలు లేదంటూ ఆంక్షలు విధించింది. ఈ ఘటన జరిగింది జనవరి 2022లో..

Bobby Kataria: విమానంలో స్మోకింగ్.. వామ్మో ఏందిది..!!

 

Bobby Kataria: స్పైస్‌జెట్ ఫ్లైట్‌లో ఓ వ్యక్తి పడుకుని స్మోక్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వ్యక్తిపై స్పందించిన సదరు ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ యాక్షన్ తీసుకుంది. అతను 15రోజుల పాటు ఆ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు వీలు లేదంటూ ఆంక్షలు విధించింది. ఈ ఘటన జరిగింది జనవరి 2022లో.. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రయత్నించడంతో ఆ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బల్వీందర్ కటారియా అలియాస్ బాబీ కటారియా అది ఒక డమ్మీ విమానమని.. ఈ షూటింగ్ అంతా దుబాయ్ లో చేశామని వివరించాడు.

“నేను స్మోకింగ్ చేస్తున్నట్లు కనిపించిన విమానం రెగ్యూలర్ గా ప్రయాణించేది కాదు. ఇదంతా దుబాయ్ లో చేసిన షూటింగ్ లోని ఒక భాగమే. విమానం లోపలికి లైటర్ తీసుకెళ్లడానికి కుదరదు” అని కటారియా పేర్కొన్నాడు.

Read Also: విమానంలో స్మోకింగ్ చేసిన బాబీ కటారియా.. స్పందించిన ఏవియేషన్ మంత్రి.. వీడియో వైరల్

ఆ వీడియోలో ఎయిర్‌క్రాఫ్ట్ సీట్లో పడుకున్న కటారియా సిగరెట్ వెలిగించుకుని రెండు దమ్ములు లాగాడు.

ఘటనపై విచారణ జరుపుతున్నామని.. వీడియో గురించి మాకు తెలియగానే అతనిపై ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేశామని తెలిపింది.

“ఈ వీడియో జనవరి 20, 2022న చిత్రీకరించారు. దుబాయ్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన SG 706 విమానంలో ప్రయాణీకులు ఎక్కుతుండగా, సదరు ప్రయాణికుడు.. అతని సహ ప్రయాణీకులు క్యాబిన్ 21వ వరుసలో వీడియోను షూట్ చేశారు. సిబ్బంది ఆన్-బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ప్రయాణికులు లేదా సిబ్బంది ఎవరికీ ఈ చర్య గురించి తెలియదు, ”అని ప్రకటనలో పేర్కొన్నారు.