Bollywood Actresses Super Cars: రోల్స్ రాయిస్ నుండి లంబోర్ఘిని వరకు.. బాలీవుడ్ భామల లగ్జరీ కార్లు!

జస్ట్ లివింగ్ కాస్ట్ లక్షలలో ఉండే తారామణులు కార్ల మీద కోట్లు ఖర్చు పెట్టడం సాధారణమే అనుకోవాలి. మన బాలీవుడ్ భామల దగ్గర ప్రపంచంలోనే కాస్ట్ లీ కార్లు కూడా ఉన్నాయి. రోల్స్ రాయిస్ నుండి లంబోర్ఖిని వంటి విదేశీ లగ్జరీ కార్లలో ఈ మన తారామణులు తెగ చక్కర్లు కొడుతుంటారు.

Bollywood Actresses Super Cars: రోల్స్ రాయిస్ నుండి లంబోర్ఘిని వరకు.. బాలీవుడ్ భామల లగ్జరీ కార్లు!

Bollywood Actresses Super Cars From Rolls Royce To Lamborghini Bollywood Actress Luxury Cars

Bollywood Actresses Super Cars: తెర మీద కనిపించే వ్యక్తులను ఆరాధించే కల్చర్ మనది. మన దేశంలో నటీనటులకు మరే ఇతర రంగంలో లేనటువంటి గుర్తింపు సొంతం. అందుకే కోటాను కోట్లను పారితోషకంగా తీసుకొనే నటీనటుల ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. వాళ్ళు వాడే చెప్పుల నుండి వేసుకొనే బట్టల వరకు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టేస్తుంటారు. అందునా హీరోయిన్స్ అయితే ఇది ఇంకాస్త అదనంగానే ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ నుండి లిప్ స్టిక్ వరకూ లక్షల రూపాయలను ధార పోస్తుంటారు. జస్ట్ లివింగ్ కాస్ట్ లక్షలలో ఉండే తారామణులు కార్ల మీద కోట్లు ఖర్చు పెట్టడం సాధారణమే అనుకోవాలి. మన బాలీవుడ్ భామల దగ్గర ప్రపంచంలోనే కాస్ట్ లీ కార్లు కూడా ఉన్నాయి. రోల్స్ రాయిస్ నుండి లంబోర్ఘిని వంటి విదేశీ లగ్జరీ కార్లలో ఈ మన తారామణులు తెగ చక్కర్లు కొడుతుంటారు.

ప్రియాంక చోప్రా నుండి దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వరకు బాలీవుడ్ నటీమణులు ఉపయోగించే అత్యంత ఖరీదైన కారు ఇవే..

1. ప్రియాంక చోప్రా
రోల్స్ రాయిస్ ఘోస్ట్ రూ.5.25 కోట్లకు

Bollywood Actresses Super Cars

Bollywood Actresses Super Cars

నటి, నిర్మాత, బిజినెస్ ఉమెన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ తో కలిసి స్టైలిష్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నుండి రెడ్ కార్పెట్ మీద దిగిన బాలీవుడ్ ప్రముఖులలో ఒకరు. 6.6-లీటర్ ట్విన్-టర్బో వి 12 పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ప్రియాంక రోల్స్ రాయిస్ 562 బిహెచ్‌పి, 780 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ వద్ద కూడా రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఉండగా హీరోయిన్స్ లో ప్రియాంకా ఈ ఘోస్ట్ కలిగిఉండడం విశేషం.

2. కత్రినా కైఫ్, అలియా భట్, అనుష్క శర్మ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ & కరీనా కపూర్ ఖాన్
రేంజ్ రోవర్ వోగ్ రూ .1.74 కోట్లకు – రూ.2.27 కోట్లు

Bollywood Actresses Super Cars

Bollywood Actresses Super Cars

కత్రినా కైఫ్ నుండి అలియా భట్, అనుష్క శర్మ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్ ఖాన్ తదితరులంతా రేంజ్ రోవర్ వోగ్ కలిగి ఉన్నారు. వీరి వద్ద కార్లలో వోగ్ లో వివిధ వెర్షన్లు కలిగి ఉండగా కత్రినా మాత్రం సొగసైన మెర్క్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.2.27 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

3. దీపికా పదుకొనే
మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 500 – రూ.1.67 కోట్ల రూపాయలు

Bollywood Actresses Super Cars

Bollywood Actresses Super Cars

మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500 జర్మన్ మార్క్ కారు అత్యంత విలాసవంతమైన మోడళ్లలో ఒకటి. కాగా, 4.7-లీటర్ ఇంజిన్‌లో నడుస్తున్న ఈ శక్తివంతమైన సెడాన్ 459 బిహెచ్‌పి శక్తిని, 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఇస్తుందని కార్టోక్ నివేదించింది. దీని ధర రూ.1.67 కోట్ల వరకు ఉంటుందట.

4. సన్నీలియోన్
మసెరటి గిబ్లి నెరిసిమో రూ.1.42 కోట్లకు

Bollywood Actresses Super Cars

Bollywood Actresses Super Cars

సన్నీలియోన్ గ్యారేజీలో ఒకటి కాదు రెండు మసెరటిలు ఉంటాయి. సన్నీ వద్ద మసెరటి ఘిబ్లి నెరిసిమో, మసెరటి క్వాట్రోపోర్ట్ ఉన్నాయి. అందులో ఒకటి 3.0-లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ వి 6 మోటారుతో నడిచేది కాగా ఒక మోటార్ 345 బిహెచ్‌పి, రెండవది 404 బిహెచ్‌పి మోటారు కలిగిన కారు. ఈ రెండు ఇంజన్లతో కారు 0-100 నుండి 3.5 సెకన్లు నుండి 4.8 సెకన్లలో వెళ్ళవచ్చు. దీని ధర రూ .1.42 కోట్లు.

5. మలైకా అరోరా
రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబి రూ.2.51 కోట్లకు

Bollywood Actresses Super Cars

Bollywood Actresses Super Cars

గత ఏడాది ఏప్రిల్‌లో మలైకా అరోరా ఒక కొత్త నేవీ బ్లూ రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబి ఆటోబయోగ్రఫీ నుండి దిగడం ఎంతగానో ఆకట్టుకుంది. ఆటోబయోగ్రఫీ అనేది ఆర్ఆర్ వోగ్ యొక్క హై-ఎండ్ ఎడిషన్, ఇందులో 4.0-లీటర్, సూపర్ఛార్జ్డ్ వి 8 పెట్రోల్, 4.4-లీటర్ వి 8 డీజిల్ ఉన్నాయి. రెండూ 300 బిహెచ్‌పి (300 కన్నా ఎక్కువ, పెట్రోల్ వి 8 అయితే, 517 బిహెచ్‌పి) 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే వాహనాలే. రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబి ఆటోబయోగ్రఫీ రూ.2.51 కోట్లు (డీజిల్‌కు) ఖర్చవుతుండగా, పెట్రోల్ ధర రూ.2.59 కోట్లు.

6. మల్లికా షెరావత్
లంబోర్ఘిని అవెంటడార్ రూ.5.01 కోట్లు

Bollywood Actresses Super Cars

Bollywood Actresses Super Cars

లంబోర్ఘిని అవెంటడార్‌ను కలిగి ఉన్న కొద్దిమంది భారతీయ ప్రముఖులలో మల్లికా షెరావత్ ఒకరు. మల్లికా లంబోర్ఘిని అవెంటడార్ ఎస్.వి కలిగి ఉండగా ఈ కారు ఎక్సైజ్ సుంకాన్ని కలిపి 8 కోట్ల రూపాయల వరకు అవుతుంది. ఈ బ్రాండ్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన శ్రేణి కాగా జాన్ అబ్రహం, రణవీర్ సింగ్, యువరాజ్ సింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్, హార్దిక్ పాండ్యా వంటి ప్రముఖులతో పాటు టాలీవుడ్ స్టార్ ప్రభాస్ కూడా ఈ మధ్యనే లంబోర్ఘిని కొన్నాడు.