NTR-Koratala Film: తారక్ కోసం బాలీవుడ్ భామ.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

మన తెలుగు హీరోలు ఇప్పుడు వారి సినిమా స్థాయిని పెంచుకొనే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాలు వరసపెట్టగా.. ఇప్పుడు బన్నీ, తారక్ లాంటి హీరోలు కూడా అదే పనిలో ఉన్నారు.

NTR-Koratala Film: తారక్ కోసం బాలీవుడ్ భామ.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

Bollywood Beauty For Tarak Official Announcement Balance

NTR-Koratala Film: మన తెలుగు హీరోలు ఇప్పుడు వారి సినిమా స్థాయిని పెంచుకొనే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్థాయి సినిమాలు వరసపెట్టగా.. ఇప్పుడు బన్నీ, తారక్ లాంటి హీరోలు కూడా అదే పనిలో ఉన్నారు. తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎలాగు రాజమౌళి మార్క్ సినిమా కావడంతో ఎన్టీఆర్ కు ఇండియా లెవల్ లో పేరు దక్కడం ఖాయం. ఇదే పనిలో తన తర్వాత సినిమాలను కూడా తారక్ అదే స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్‌లో ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తో రాబోయే సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. దానికి అనుగుణంగానే సినిమాలో కాస్టింగ్ ఎంపిక చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి కొరటాల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. బీటౌన్ హీరోయిన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందనే ఆలోచనలో ఉన్నాడట.

గత కొద్దిరోజులుగా హీరోయిన్ ఎంపికలో ఉన్న కొరటాల ఫైనల్ గా ఓ బాలీవుడ్ భామను ఫైనల్ చేసినట్లుగా వినిపిస్తుంది. బాలీవుడ్ లో కియారా అద్వానీ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ బ్యూటీ. వరస భారీ ప్రాజెక్టులతో కియారా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కియారా ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలను చేసింది. అందులో మహేష్ తో నటించిన భరత్ అనే నేను భారీ బ్లాక్ బస్టర్ కాగా.. రామ్ చరణ్ తో చేసిన వినయవిధేయ రామ భారీ డిజాస్టర్ గా మారింది. కాగా, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తారక్ కోసం కియారాను తీసుకొస్తున్నాడట కొరటాల శివ.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కి అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా ఇందులో ఒక హీరోయిన్ గా కియారా అద్వానీని ఫైనల్ చేసిన కొరటాల మరో హీరోయిన్ గా కొత్త హీరోయిన్ సాయీ మంజ్రేకర్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌లో ఉన్న కొరటాల దానిని పూర్తి చేసి జూన్, జులై నెలల్లో ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి అప్పటి వరకు హీరోయిన్స్ విషయంలో ఇలానే సీక్రెట్ మైంటైన్ చేస్తారో లేక ఈలోగా అధికారిక ప్రకటనలు ఏమైనా ఉంటాయో చూడాల్సి ఉంది.

Read: Prabhas Upcoming Film: యేలేటితో ప్రభాస్.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!