బాలీవుడ్ డ్రగ్స్ కేసు సుశాంత్ స్నేహితుడు అరెస్ట్ | Sushant Singh Rajput

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుశాంత్ స్నేహితుడు అరెస్ట్..

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుశాంత్ స్నేహితుడు అరెస్ట్..

Bollywood Drugs Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతితో హిందీ చిత్రసీమలో డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయ్యింది. ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. సుశాంత్ ఆత్మహత్య వల్ల బాలీవుడ్ బడాబాబుల బాగోతం బయటపడింది.

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు, సహాయ దర్శకుడు రిషికేశ్ పవార్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
పవార్‌పై డ్రగ్స్ వినియోగం, సప్లై చెయ్యడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సుశాంత్‌కు కూడా అతడు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సుశాంత్ మాజీ స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా తన వాంగ్మూలంలో పవార్ పేరును వెల్లడించినట్టు తెలిపారు.

సుశాంత్ ఇంట్లో పనిచేసే దీపేష్ సావంత్‌ కూడా విచారణలో రిషికేశ్ పేరును వెల్లడించాడు. దీపేష్ ఇచ్చిన సమాచారంతో ఎన్‌సీబీ అధికారులు పవార్ ఇంటిపై దాడిచేసి ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్‌తో మంచి పరిచయం కలిగిన ఇతను సుశాంత్ డ్రీమ్ ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నట్టుగా సమాచారం.

×