Bollywood Songs : బాలీవుడ్‎ను షేక్ చేస్తున్న మసాలా సాంగ్స్..

సోషల్ మీడియాను ఊపు ఊపుతున్న హిందీ సాంగ్స్..

Bollywood Songs : బాలీవుడ్‎ను షేక్ చేస్తున్న మసాలా సాంగ్స్..

Bollywood Songs

Bollywood Songs: ఇన్ని రోజులు కొత్త పాటలు లేక ఖాళీగా ఉన్న బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు రీల్స్ చుట్టేస్తున్నారు. హాట్ హాట్ సాంగ్స్‌తో మస్తీ మజా చూపిస్తున్నారు. త్వరలో రిలీజ్ కాబోయే కొన్ని మోస్ట్ అవైటెడ్ హిందీ ప్రాజెక్ట్స్ నుంచి వరుసగా వచ్చిన ట్రాక్స్ కొన్ని ఆడియెన్స్‌ని ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి.

Prithviraj : సామ్రాట్ ‘పృథ్వీరాజ్‌’ చౌహాన్‌గా అక్షయ్ కుమార్.. టీజర్ చూశారా?

ఇన్ని రోజులు డ్రై ఫేజ్‌ను అనుభవించిన బాలీవుడ్ ఆడియెన్స్.. ఇప్పుడు ఒక్కసారిగా ఫుల్ ఎనర్జీని చూపిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజవుతున్న సాంగ్స్ కొన్ని వాళ్లకి ఊపునిస్తున్నాయి. నవంబర్ 19న థియేటర్స్‌కి రాబోతున్న ‘బంటీ ఔర్ బబ్లీ’ నుంచి రిలీజైన సాంగ్స్ బాలీవుడ్ ప్రేక్షకులతో స్పెప్పులేయిస్తున్నాయి.

Bunty Aur Babli 2

అలాగే నవంబర్ 25న విడుదల కాబోతున్న జాన్ అబ్రహం ‘సత్యమేవ జయతే 2’ సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా మామూలు హల్‌చల్ చేయట్లేదు. ఇందులో కొత్తగా ‘కుసు కుసు’ అంటూ వచ్చేసిన నోరా ఫతేహి సాంగ్ యూత్‌ని బాగా అట్రాక్ట్ చేస్తోంది.

Satyameva Jayate 2

నవంబర్ 26న రిలీజ్‌కి రెడీఅవుతోన్న ‘అంతిమ్’ నుంచి కూడా బీట్స్ మామూలు సౌండ్ చేయట్లేదు. సల్మాన్ కీ రోల్ చేస్తోన్న ‘అంతిమ్ – ది ఫైనల్ ట్రూత్’ లో ఆయన బావ ఆయుష్ శర్మ లీడ్ రోల్ చేస్తున్నాడు. కొన్నిరోజులు ముందు రిలీజైన ‘విగ్నహర్త, భాయి కి బర్త్‌డే’ సాంగ్స్ ఇప్పటికీ సందడి చేస్తుండగా…నిన్నటికి నిన్న రిలీజైన ‘చింగారీ’ సాంగ్ వీటిని క్రాస్ చేసి దూసుకుపోతుంది. సోషల్ మీడియా యాప్స్ పదాలను యూజ్ చేసి మసాలా మిక్స్ చేసారు ఈ పాటలో..

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!

‘ఆర్ఎక్స్ 100’ రీమేక్ ‘తడప్’ మూవీ హైరేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేస్తోంది. ట్రైలరే సూపర్బ్‌గా అట్రాక్ట్ చేస్తే అంతకుమించి అన్న లెవెల్‌లో ఒక్కొక్క సాంగ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి. రొమాంటిక్ సాంగ్స్‌లో అహాన్ శెట్టి, తారా సుతారియా రచ్చ ఓ వైపు ఆడియెన్స్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంటే.. ఈ సినిమాలోని ఫాస్ట్ బీట్ అంతే రేంజ్‌లో చక్కర్లు గొడుతుంది.

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

Sooryavanshi

లేటెస్ట్ రిలీజ్ ‘సూర్యవంశీ’ మరోసారి అక్షయ్ కుమార్‌ని 100 కోట్ల క్లబ్‌లో పడేసింది. ఇది ఖిలాడి 100 కోట్లు కొల్లగొట్టిన 15వ సినిమా కాగా ఇందులోని పాటలు బాగానే అట్రాక్ట్ చేస్తున్నాయి. రీసెంట్‌గా యూట్యూబ్‌లోకి వచ్చిన రీమేక్ సాంగ్ ‘టిప్ టిప్ బర్సా పానీ’ హాట్ హాట్ హాటెస్ట్ సాంగ్‌గా కత్రినాకు పేరు తీసుకొస్తుంది.