Star Kids : బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ కిడ్స్..

స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు మాత్రం కష్టపడకుండా సింపుల్‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు..

Star Kids : బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న స్టార్ కిడ్స్..

Bollywood Star Hero Kids Entry In Movies

Star Kids: ఎంతో కష్టపడి.. పోర్ట్ ఫోలియోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ, అవకాశాల కోసం తిరిగారు సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు, హీరోయిన్లు.. బట్.. ఆ స్టార్ కిడ్స్ మాత్రం అంత కష్టపడకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఎవరో చూద్దామా..

ఎంతో కష్టపడితేనే కానీ.. సినిమాల్లో ఛాన్స్, స్టార్ స్టేటస్, ఇమేజ్ రాదు. కానీ స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు మాత్రం ఇంత కష్టపడకుండా సింపుల్‌గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్.. సిద్దార్థ్ పి.మల్హోత్రా డైరెక్షన్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. సెకండ్ వేవ్ తర్వాత సెట్స్ మీదకొచ్చిన ఈ సినిమా అన్ని జాగ్రత్తలతో షూటింగ్ మొదలుపెట్టింది. యష్ రాజ్ ఫిల్మ్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మహా రాజా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారని టాక్.

బాలీవుడ్ యాక్షన్ హీరో అయిన సునీల్ శెట్టి కొడుకు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. సునీల్ కొడుకు అహాన్ శెట్టి ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాని మోహిత్ సూరి డైరెక్షన్లో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. మరో సెలబ్రిటీ సన్ అహాన్ పాండే కూడా బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ కూతురు షనయా కపూర్ కూడా సిల్వర్ స్క్రీన్ మీదకు రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. జాన్వీ కపూర్ కజిన్ అయిన షనయా.. కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్‌లో జూలై నుంచి సినిమా స్టార్ట్ చేస్తోంది. ఇప్పటికే ‘గుంజన్ సక్సేనా’ మూవీకి అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన షనయా.. ఫోటో షూట్స్‌తో హంగామా చేస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న అనన్య పాండే కజిన్ అయిన అహాన్‌కి ఇన్‌స్టాలో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ డెబ్యూ డైరెక్టర్ షివ్ రావలి డైరెక్షన్లో అజయ్ దేవ్‌గణ్ విలన్‌గా సినిమా సైన్ చేశాడు అహాన్ పాండే. జాన్వీ ఆల్రెడీ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు రెండో కూతురు ఖుషీ తన దైన స్టైల్లో ర్యాంప్ వాక్స్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ మధ్యనే స్టార్ ప్రొడ్యూసర్‌తో అఫీషియల్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది ఖుషీ కపూర్.