Bollywood : ఇద్దరు స్టార్ హీరోలు.. అయినా తప్పని ఫ్లాపులు.. బాలీవుడ్ కి భరోసా ఎప్పుడో??

ఈనెల 11న బాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రెండు బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్.......

Bollywood : ఇద్దరు స్టార్ హీరోలు.. అయినా తప్పని ఫ్లాపులు.. బాలీవుడ్ కి భరోసా ఎప్పుడో??

laal singh chaddha

Bollywood :  రోజు రోజుకీ బాలీవుడ్ సినిమా ప్రేక్షకుడికి దూరమవుతుందా అంటే అవుననే అంటున్నారు మూవీ లవర్స్. ఎందుకంటే భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాలెన్నో బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడుతున్నాయి. లేటెస్ట్ గా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరి బాలీవుడ్ ఇండస్ట్రీకి షాకిచ్చాయి.

ఈనెల 11న బాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటేమో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, రెండు బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్. ఇద్దరూ సూపర్ స్టార్ లే కావడంతో భారీ ఓపెనింగ్స్ ఉంటాయనుకున్నారంతా. కాని అత్యల్ప ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ముందు బ్లాస్ట్ అయిపోయాయి.

ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా వచ్చిన లాల్ సింగ్ చడ్డా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను అద్వైత్ చందన్ తెరకెక్కించాడు. ఈ సినమాతో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. కాని, ఈ సినిమా రిజల్ట్ చాలా పూర్ గా ఉంది. మొత్తం ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం 12 కోట్లకే పరిమితమైంది. అమీర్ ఖాన్ సినిమా అంటే భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. అలాంటిది మన టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోకొచ్చే కలెక్షన్స్ వసూల్ చేసి, డివైడ్ టాక్ తో రన్ అవుతుండటంతో ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది.

Premi Vishwanath : వంటలక్క ఈజ్ బ్యాక్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన కార్తీకదీపం సీరియల్ యూనిట్..

ఇక బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ఫ్యామిలీ డ్రామా రక్షా బంధన్ కూడా అక్షయ్ కుమార్ నే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీనే నిరాశ పరిచింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆయన పృథ్వీరాజ్ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కన్నా తక్కువ కేవలం 9 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది. దాంతో బాలీవుడ్ స్టార్ హీరోలకే సక్సెస్ కొట్టడం సవాలుగా మారుతోంది. ఇలా స్టార్ హీరోలే ఫలాప్స్ ఇస్తుంటే ఇంకా బాలీవుడ్ కి భరోసా ఎవరిస్తారు, ఎప్పుడిస్తారు అని బాలీవుడ్ వర్గాలు తెగ మదనపడిపోతున్నారు.