Release Clash: బాలీవుడ్‌కీ తప్పని రిలీజ్ కష్టాలు.. వర్రీ అవుతున్న స్టార్లు!

ప్పుడు ఏ సినిమా వచ్చి రిలీజ్ కి అడ్డం పడిపోతుందో అని వర్రీ అవుతున్నారు స్టార్లు. అందుకే ముందు గానే 2,3 డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలా చేసినా కూడా రిలీజ్ వర్కవుట్ అవ్వడం లేదు.

Release Clash: బాలీవుడ్‌కీ తప్పని రిలీజ్ కష్టాలు.. వర్రీ అవుతున్న స్టార్లు!
ad

Release Clash: ఎప్పుడు ఏ సినిమా వచ్చి రిలీజ్ కి అడ్డం పడిపోతుందో అని వర్రీ అవుతున్నారు స్టార్లు. అందుకే ముందు గానే 2,3 డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలా చేసినా కూడా రిలీజ్ వర్కవుట్ అవ్వడం లేదు. అందుకే బాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడు వేరేదారి లేక సినిమాలన్నీ రీషెడ్యూల్ చేసుకుంటున్నాయి.

Bollywood : ఒకే సినిమాలో సల్మాన్, షారుఖ్, హృతిక్.. బాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ రాబోతోంది!

బాలీవుడ్ లో కూడా ఈరిలీజ్ క్లాష్ తప్పడం లేదు. అందుకే ఎందుకొచ్చిన కలెక్షన్ల కోత అని డేట్స్ మార్చుకుని రీషెడ్యూల్ చేసకుంటున్నాయి. తెలుగులో వరుణ్ తేజ్ గద్దలకొండగణేష్ ని బచ్చన్ పాండేగా రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాని రీషెడ్యూల్ చేసుకున్నారు. లాస్ట్ మన్త్ రిలీజ్ అవ్వాల్సిన బచ్చన్ పాండేని లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి మార్చి 18 అంటూ డేట్ ఫిక్స్ చేశారు.

Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

అక్షయ్ కుమార్ భారీ హిస్టారికల్ యాక్షన్ మూవీ పృద్విరాజ్ కూడా రీషెడ్యూల్ అయ్యింది. సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ.. కోవిడ్ తో లేటయిపోయిన ఈ సినిమా.. ఏప్రిల్ ఫస్ట్ న రిలీజ్ కావల్సి ఉంది కానీ ఇప్పుడు జూన్ 10కి పోస్ట్ పోన్ అయ్యి రిలీజ్ రీషెడ్యూల్ చేసుకుంది.

Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!

లాస్ట్ ఇయర్ ఎండ్ కి డిసెంబర్ 31రిలీజ్ అవ్వాల్సిన జెర్సీ.. పాండమిక్ టైమ్ లోఎందుకని రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. టైమ్ చూసుకుని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్న టీమ్.. మొన్నీమధ్యనే కెజిఎఫ్ 2 డేట్ ని లాక్ చేసుకుంది. తెలుగులో నాని హీరోగా సూపర్ హిట్ అయిన మూవీ జెర్సీకి రీమేక్ గా వచ్చిన హిందీ జెర్సీ.. ఏప్రిల్ 14న రిలీజ్ రీషెడ్యూల్ చేసుకుంది.

2021 Bollywood Films: బాలీవుడ్‌కి కలిసిరాని 2021.. వచ్చే ఏడాదిపైనే ఆశలన్నీ!

రణ్ బీర్ కపూర్ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ షంషేరా కూడా రిలీజ్ డేట్ మార్చుకుంది. ఈసినిమా వచ్చేనెలలో మార్చి 18న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే.. ఇప్పుడుడేట్ మార్చుకుని జులై 22న రిలీజ్ రీషెడ్యూల్ చేసుకుంది. షారూఖ్ ఖాన్ పఠాన్ మూవీ కూడా ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ ప్లాన్ చేసుకుంది. కానీ సినిమా ఫినిష్ అయ్యేలా లేదని నెక్ట్స్ ఇయరే రిలీజ్ అంటూ రీషెడ్యూల్ ప్లాన్స్ లో ఉన్నారు పఠాన్ టీమ్.