Bombay High Court : ‘పెదవులపై ముద్దులు పెట్టడం, ప్రైవేటు పార్టులను తాకటం లైంగిక నేరం కాదు’..

‘ బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం, ప్రైవేటు పార్టులను తాకటం లైంగిక నేరం కాదు’..అంటూ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.

Bombay High Court : ‘పెదవులపై ముద్దులు పెట్టడం, ప్రైవేటు పార్టులను తాకటం లైంగిక నేరం కాదు’..

Kissing And Fondling Boy Not Unnatural Offence Says Bombay High Court

Bombay High Court : కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు వింత వింత తీర్పులు ఇస్తుంటాయి. మరికొన్ని కేసుల్లో వివాదాస్పద తీర్పులు కూడా ఇస్తుంటాయి. అటువంటి తీర్పునే ఇచ్చింది బాంబే హైకోర్టు. 14 ఏళ్ల బాలుడిని ముద్దు పెట్టుకోవడం..అతని ప్రైవేటు పార్టులను ఇష్టమొచ్చినట్లుగా తాకటం..తడమటం లైంగిక వేధింపులు కాదని అది నేరం కాదని తీర్పునిస్తూ అటువంటి చర్యలకు పాల్పడిన వారికి బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం 14 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చింది బాంబే అత్యున్నత ధర్మాసనం.

ఎఫ్ఐఆర్ ప్రకారం..ముంబైకి చెందిన ఓ వ్యక్తి బీరువాలోని డబ్బులు తరచూ మాయం అవుతుండడంతో తన 14 ఏళ్ల కుమారుడిని అనుమానించాడు. డబ్బులు ఏమవుతున్నాయని గద్దించగానే బాలుడు నిజం ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు తానే తీస్తున్నానని, వాటితో ఆన్‌లైన్ గేమ్స్ రీచార్జ్ చేయించుకుంటున్నానని తెలిపాడు. ఈ క్రమంలో సదరు బాధిత బాలుడు మరో విషయాన్ని కూడా బయటకు చెప్పుకొచ్చాడు.

రీచార్జ్ కోసం తాను ఓ షాపునకు వెళ్లినప్పుడు ఆ షాపు యజమాని తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెడుతున్నాడని..అలాగే తన ప్రైవేటు పార్టులు తడుముతున్నాడని చెప్పాడు. ఈ విషయాలు విన్న బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు సదరు షాపు యజమానిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 377 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం నిందితుడు రిమాండ్ లో ఉన్నాడు. ఏడాదిగా జైలులో ఉన్న నిందితుడు ఇటీవల బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును పరిశీలించి విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభు దేశాయ్.. నిందితుడు బాలుడి పెదాలపై ముద్దులు పెట్టాడని, తాకాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు..కానీ ఈ అభియోగాలు సెక్షన్ 377 కిందికి రావని తేల్చిచెప్పారు. అనంతరం నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. బాలుడికి వైద్య పరీక్షల్లో లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారణ కాలేదని జస్టిస్ ప్రభుదేశాయ్ వెల్లడిస్తూ బెయిల్ మంజూరు చేశారు. నిందితుడు ఇప్పటికే కస్టడీలో ఏడాది కాలం గడిపాడని..కాబట్టి బెయిల్‌కు అర్హుడని తేల్చి చెప్పారు. కాగా..సెక్షన్ 377 కింద కేసు నమోదైతే బెయిలు రావడం కష్టమనే చెప్పాలి.అంతేకాదు ఈ సెక్షన్ కింద కేసు నమోదు అయి నేరం నిరూపించబడితే జీవిత శిక్ష కూడా పడే అవకాశం ఉంది.