Bombing Hits Mosque: రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి.. 12 మంది మృతి!

ప్రపంచవ్యాప్తంగా రంజాన్ సంబరాలు కొనసాగుతుండగానే అఫ్గానిస్థాన్ లో బాంబు దాడి కలకలం రేపింది.​ ఉత్తర కాబుల్​లోని మసీదుపై శుక్రవారం బాంబు దాడి జరిగింది.

Bombing Hits Mosque: రంజాన్ వేళ మసీదుపై బాంబు దాడి.. 12 మంది మృతి!

Bombing Hits Mosque

Bombing Hits Mosque: ప్రపంచవ్యాప్తంగా రంజాన్ సంబరాలు కొనసాగుతుండగానే అఫ్గానిస్థాన్ లో బాంబు దాడి కలకలం రేపింది.​ ఉత్తర కాబుల్​లోని మసీదుపై శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని అఫ్గాన్​ పోలీసులు తెలుపగా.. మరో 15 మందికి గాయాలయ్యాయని చెప్పారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మసీదులో ప్రార్ధనలు మొదలుకాగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ పేలుడులో ముస్లిం మతగురువు ఒకరు కూడా మృతి చెందారని ఇక్కడి పోలీసు ప్రతినిధి ఫెర్డాస్​ ఫరామార్జ్​ తెలిపారు.

సహజంగా ఇలాంటి దాడులు జరిపిన వెంటనే ఉగ్రవాదులు ఇది తమ చర్యగా ప్రకటిస్తుంటారు. కానీ
ఈ బాంబు దాడికి తామే బాధ్యులం అంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదని ఇక్కడి అధికారులు చెప్పారు. అయితే, జరిగిన పేలుళ్లను చూస్తే మతగురువు లక్ష్యంగానే ఈ బాంబు దాడి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. నిజానికి రంజాన్​ పర్వదినాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని అఫ్గాన్​ ప్రభుత్వం తాలిబన్లతో ఒప్పందం చేసుకుంది. కానీ, బాంబు దాడితో మారణ హోమం జరిగింది. ఈ దాడికి తాలిబన్లే కారణమని ఇంకా నిర్ధారణ కాకపోగా వారిపనిగానే స్థానిక ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది.