రాజమౌళి అన్‌ప్రొఫెషనల్.. బోనీ కపూర్ ఫైర్..

రాజమౌళి అన్‌ప్రొఫెషనల్.. బోనీ కపూర్ ఫైర్..

Boney Kapoor: టాలీవుడ్ టాప్ డైరెక్టర్, పర్‌ఫెక్షనిస్ట్‌కి మారు పేరు, తనకు కావల్సినట్టు షాట్ వచ్చేవరకూ ఎంత టాప్ స్టార్స్ అయినా రీ టేక్‌లు చేయిస్తారు.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కే జక్కన్న.. అసలు ఫ్లాప్ ఫేస్ చెయ్యని స్టార్ డైరెక్టర్ అంటూ రాజమౌళిని ముద్దుగా పిలుచుకుంటారు. కానీ బోనీకపూర్ మాత్రం రాజమౌళి అన్‌ప్రొఫెషనల్, అన్‌ఎథికల్ అంటూ తెగ తిట్టిపోస్తున్నాడు. వీళ్లిద్దరికీ అదేదో ఇప్పుడే మొదలైన గొడవ కాదు.. 5 ఏళ్లక్రితం మొదలైన ఇష్యూ ఇంకా ఆగిపోలేదా..?

 

రాజమౌళి తెలుగులో టాప్ డైరెక్టర్. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ స్టార్ డైరెక్టర్ మీద బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఫైర్ అవుతున్నారు. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అనైతికం అంటూ ఫైర్ అవుతున్నారు బోనీ. ట్రిపుల్ ఆర్ రిలీజ్ విషయం ఒక్కటే కాదు.. 5 ఏళ్ల నాటి ఇష్యూ ఇంకా వీళ్లిద్దరి మధ్య నలుగుతోందని అటు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా టాక్ నడుస్తోంది.

Maidaan

అసలే సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది కాబట్టి కలెక్షన్లు డ్రాప్ అవ్వకూడదనే ఉద్దేశ్యంలో అందరూ డిస్కస్ చేసుకుని క్లాష్ అవ్వకుండా రిలీజ్‌లు అనౌన్స్ చేస్తేుంటే.. రాజమౌళి మాత్రం ఇలా చెయ్యడం తప్పు అంటున్నారు బోనీకపూర్. 6 నెలలకు ముందే తన ప్రొడక్షన్‌లో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న ‘మైదాన్’ సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 15 అని అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలిసి కూడా ఇలా అనైతికంగా సినిమా రిలీజ్ అనౌన్స్ చెయ్యడం కరెక్ట్ కాదన్నారు బోనీ. రాజమౌళి ఇలా చెయ్యడం ఇప్పుడే కాదు.. 5 ఏళ్ల క్రితం ‘బాహుబలి’ లో శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అడిగినప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేశారని, ఏం సమాధానం చెప్పలేదని అంటున్నారు బోనీ కపూర్.

RRR

రాజమౌళి శివగామి క్యారెక్టర్ కోసం శ్రీదేవిని అడిగినప్పుడు.. చాలాతక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని, అసలు అప్పట్లో శ్రీదేవి ఫుల్‌ఫామ్‌లో ఉందని, అలాంటప్పుడు అంత తక్కువ రెమ్యునరేషన్‌కి ఎలా ఒకే చెబుతారంటున్నారు బోనీ. శ్రీదేవి ఒప్పుకోలేదని.. శ్రీదేవి గురించి మీడియాలో చాలా తప్పుగా మాట్లాడారని, రాజమౌళి అందుకే అన్‌ప్రొఫెషనల్ అని పబ్లిక్‌గానే చెబుతున్నారు బోనీ కపూర్. ‘మైదాన్’ రిలీజ్ డేట్ విషయం గురించి బోనీతో డిస్కస్ చెయ్యమని రాజమౌళికి అజయ్ చెప్పినా.. రాజమౌళి మాత్రం బోనీ కపూర్‌తో మాటమాత్రం కూడాచెప్పకుండా అక్టోబర్ 13 రిలీజ్ అనౌన్స్ చేసేశారని ఇలాంటి బిహేవియర్‌తో రాజమౌళి ఎంత అన్‌ప్రొఫెషనలో అర్థమవుతోందటున్నారు బోనీ.