Waltair Veerayya: బాస్ పార్టీ నుంచి మరో ట్రీట్ రానుందా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ‘బాస్ పార్టీ’ అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.

Waltair Veerayya: బాస్ పార్టీ నుంచి మరో ట్రీట్ రానుందా..?

Boss Party Making Video To Be Out From Waltair Veerayya

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ‘బాస్ పార్టీ’ అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్‌గా కంపోజ్ చేయగా, ఇందులో మెగాస్టార్ చాలా రోజుల తరువాత పక్కా మాస్ అవతారంలో కనిపించాడు.

Also Read: బాస్ పార్టీలో డీజే వీరయ్య ఊరమాస్ బీట్స్.. చిరు స్వాగ్ మామూలుగా లేదుగా!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఈ మాస్ సాంగ్‌లో బాస్‌తో కలిసి చిందులు వేసింది. ఇక ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా దూసుకుపోతుంది. ఈ సాంగ్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ పాటకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతుండటంతో, దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆదివారం రోజున బాస్ పార్టీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుందట.

Also Read: బాస్ పార్టీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. వాల్తేరు వీరయ్య!

అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ఇక ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో చిరు కనిపిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.