Boss memo to Employees : ‘పని వేళల్లో స్నేహంగా, సరదాగా ఉండకూడదు’.. ఓ కంపెనీ ఉద్యోగులకు బాస్ పంపిన మెమో వైరల్

ఆఫీస్‌కి రెగ్యులర్‌గా లేట్‌గా వస్తేనో.. పనుల్లో కంటిన్యూగా తప్పులు చేస్తుంటేనో.. ఆఫీసు కార్యకలాపాలకు భంగం కలిగిస్తేనో బాస్ మెమో ఇచ్చినా అర్ధం ఉంది. ఓ కంపెనీ బాస్ ఇచ్చిన మెమో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అందులో ఏముంది?

Boss memo to Employees : ‘పని వేళల్లో స్నేహంగా, సరదాగా ఉండకూడదు’.. ఓ కంపెనీ ఉద్యోగులకు బాస్ పంపిన మెమో వైరల్

Boss memo to Employees

Boss memo to Employees :  ఒక్కో కంపెనీలో ఒక్కో రకమైన కల్చర్ ఉంటుంది. ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేయడానికి యాజమాన్యాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి. పని విషయంలో ఉద్యోగులు కూడా కలిసి మెలసి పనిచేయాలని కంపెనీ సూచిస్తుంది. అయితే ఓ కంపెనీ బాస్ ఉద్యోగులకు పంపిన మెమో పెద్ద చర్చకు దారి తీసింది. ఇది ఏ రకమైన సంస్కృతిని ప్రోత్సహించినట్లని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ మెమోలో ఏముంది?

Baldness : బట్టతల ఉందని ఉద్యోగం నుంచి తీసేసిన బాస్ .. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఉద్యోగి

ఓ కంపెనీ యజమాని తన కంపెనీ ఉద్యోగులకు పంపిన మెమోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెమోలో బాస్ ఆఫీస్‌లో సరదాగా ఉండకూడదని నోట్‌ను పంపారు. అందులో ఇంకా ఏముందంటే?  ‘చేసే ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టండి.. పని అంటే సరదా కాదు.. అది మీ బాధ్యత.. పనికి రాని విషయాల మీద చర్చలు పెట్టడానికి టైం వేస్ట్ చేయకండి.. పని సమయంలో కొలీగ్స్‌తో స్నేహంతో మెలగనవసరం లేదు. మీ ఫోన్ నంబర్లు మార్చుకుని పని పూర్తైన తర్వాత మీ మీటింగ్‌లు పెట్టుకోండి. ఎవరైనా పని మానేసి చర్చలు పెడుతుంటే నాకు చెప్పండి. పని అనేది మీ డే కేర్ కాదు’ అంటూ బాస్ మెమోపై సంతకం చేసి మరీ పంపారు. ఏ కంపెనీ? బాస్ పేరేంటి? అనే వివరాలు గోప్యంగా ఉంచినా మెమోను చూసిన నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు.

Viral Video: బాస్‌కు గిఫ్ట్ ఇచ్చిన ఉద్యోగులు.. మేనేజర్ ఇచ్చిన రియాక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా

‘ఈ పోస్టర్‌ని మీరు సరదాగా పోస్ట్ చేశారేమో?.. ఇవన్నీ పాటించడానికి మేము సిద్ధంగా లేమని’ కొందరు.. ‘నాకు ఇలాంటి బాస్ ఉన్నారని.. పనిలో ఉద్యోగులు స్నేహభావంతో మెలిగితేనే మంచి అవుట్ పుట్ వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పాపం ఆ బాస్ ఎవరో కానీ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాడు.