Liger: లైగర్ కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. నిజమా?

దర్శకుడు పూరి జగన్నాధ్ స్టయిలే వేరుగా ఉండే సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్న పూరి అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సెన్సేషనల్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండను..

Liger: లైగర్ కోసం బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్.. నిజమా?

Liger

Liger: దర్శకుడు పూరి జగన్నాధ్ స్టయిలే వేరుగా ఉండే సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్న పూరి అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సెన్సేషనల్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండను ఇప్పుడు మరో రేంజ్ లో చూపించేందుకు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎన్నో ప్లాన్స్ చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాపై ఇప్పటికే అనేక రూమర్స్ ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించాలని అందుకే ప్రస్తుతం ఆ పాత్ర కోసం అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఈ వార్తలో ఎంత వాస్తవం ఉంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే అయినా ఈ సినిమా నిర్మాణంలో భాగమైన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తలచుకుంటే అది పెద్దదేమీ కాదనే వాళ్ళు లేకపోలేదు.

ఇక ఇప్పటికే ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న విజయ్‌ క్రేజీ మేకోవర్‌తో లైగర్‌ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’ను తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కానుంది. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ఇస్తోందో చూడాలి.