Boy In Borewell: బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న రక్షణ చర్యలు

రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు.

Boy In Borewell: బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న రక్షణ చర్యలు

Boy In Borewell

Boy In Borewell: ఇంటి వెనకాల ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ ఘటన చత్తీస్‌ఘడ్‌లో జరిగింది. జంజ్‌గిర్ చంపా జిల్లాలోని పిరిద్ అనే గ్రామంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగం (ఎన్డీఆర్ఎఫ్)తోపాటు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (ఎస్‌డీఆర్ఎఫ్) కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

Pink Lake: గుజరాత్‌లో పింక్ లేక్.. అద్భుతం అంటున్న స్థానికులు

బాలుడిని రక్షించేందుకు నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపు 16 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడు పడిపోయిన బావి 80 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతానికి 50 అడుగులకు పైగా తవ్వకం పూర్తైంది. 65 అడుగుల వరకు తవ్విన తర్వాత బాలుడు ఉన్న ప్రదేశానికి సమాంతరంగా మరో టన్నెల్ తవ్వుతారు. ప్రస్తుతం బాలుడు సజీవంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సీఎం కూడా ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.