Boyapati: బోయపాటి కథకు అసలు హీరో రామ్ కాదట.. ఎవరో తెలుసా?

మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకులు థియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో బోయపాటి శ్రీను తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఇటీవీల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.

Boyapati: బోయపాటి కథకు అసలు హీరో రామ్ కాదట.. ఎవరో తెలుసా?

Boyapati Opted Ram Pothineni After This Star Hero Rejected

Boyapati: మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకులు థియేటర్లకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బోయపాటి లాస్ట్ మూవీ ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ చెలరేగిపోయి నటించడంతో ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. ఇక అఖండ విజయం తరువాత బోయపాటి తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తూ వచ్చారు.

BoyapatiRAPO: వరుస అప్డేట్స్‌తో అదరగొట్టిన రామ్ బోయపాటిలు!

కాగా, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో బోయపాటి శ్రీను తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఇటీవీల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో రామ్ పోతినేని ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఓ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

Boyapati Sreenu: వారియర్ దెబ్బ బోయపాటికి పడిందా..?

బోయపాటి ఈ సినిమాలో తొలుత హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను తీసుకోవాలని తెగ ప్రయత్నించాడట. అయితే బన్నీ, పుష్ప-2 మూవీకి భారీగా డేట్స్ ఇవ్వడంతో బోయపాటితో సినిమాకు డేట్స్ ఇవ్వలేనని చెప్పాడు. దీంతో బోయపాటి ఈ సినిమాలో హీరోగా రామ్ పోతినేనిని ఓకే చేశాడు. ఇక ఈ సినిమాను కూడా బోయపాటి తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.