Marriage To Ghosts : మనుషులే పెళ్లి పెద్దలుగా..‘ప్రేతాత్మలకు పెళ్లిళ్లు’..! కులం,గోత్రం, కట్న కానుకలు తప్పనిసరి..!!

ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకోవటం ఎక్కడా చూశారా?ఈ ప్రేతాత్మల పెళ్లి విషయంలో కచ్చితంగా కులం, గోత్రం, కట్నాలు, కానుకలు, వావి వరసలు,సంప్రదాయాలను పక్కాగా ఉండాలి. లేదంటే ప్రేతాత్మలకు జరగాల్సిన పెళ్లి..పెళ్లిపీటలమీదే పెటాకులవుతుంది..!

Marriage To Ghosts : మనుషులే పెళ్లి పెద్దలుగా..‘ప్రేతాత్మలకు పెళ్లిళ్లు’..! కులం,గోత్రం, కట్న కానుకలు తప్పనిసరి..!!

Marriage To Ghosts In Karnataka

Marriage To Ghosts in Karnataka: పిల్లకైనా పిల్లాడికైనా పెళ్లి చేయాలి అంటూ మంచి సంబంధాలు వెదుకుతారు.కులం, గోత్రం, వావి వరసలు, ఆస్తిపాస్తులు..సంప్రదాయాలు అన్ని చూసి మరీ పెళ్లి చేస్తారు పెద్దలు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు చూసి ఉంటాం. వర్షాకాలంలో కప్పలకు పెళ్లి చేయటం గురించి విని ఉంటాం. కానీ చనిపోయినవారికి (ఆత్మలకు) పెళ్లి చేయటం గురించి ఎక్కడన్నా విన్నారా? అంటూ వినలేదనే చెబుతాం. కానీ ఎప్పుడో 30,40 ఏళ్ల క్రితం చనిపోయినవారికి (ఆత్మలు) పెళ్లిళ్లు చేసే వింత ఆచారం ఉంది కర్ణాటకలో. ఈ పెళ్లికి మనుషులే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అంతేకాదండోయ్..ఈ పెళ్లికి కులగోత్రాలు అత్యంత ముఖ్యం. వీటికి తోడు కట్నకానులకు కూడా అత్యంత ముఖ్యంగా ఉంటాయి. ఇక వావివరుసలు మరింత ముఖ్యం.

కర్ణాటకలో ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకునే ఓ విచిత్ర సాంప్రదాయం గురించి వింటే నోరెళ్లబెట్టాల్సిందే. బతికున్నవారు పెళ్లి విషయంలో అయినా ఈరోజుల్లో కాస్త రాజీ పడి చేస్తుంటారు గానీ ఈ ప్రేతాత్మల పెళ్లి విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడరు. మనుషుల పెళ్లి విషయంలో అదీ ప్రేమపెళ్లిళ్లు విషయంలో కులాల గురించి పట్టించుకోకుండా చాలానే జరుగుతున్నాయి. కానీ ఈ ప్రేతాత్మల పెళ్లిళ్లలో అటువంటివి జాన్తానై. కచ్చితంగా కులం, గోత్రం, కట్నాలు, కానుకలు, వావి వరసలు,సంప్రదాయాలను పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు ఈ వింత ఆచారంలో.

ఈ వింత ప్రేతాత్మల పెళ్లిళ్ల సంప్రదాయం దక్షిణ కన్నడ జిల్లాలో కొందరు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం చచ్చిపోయిన తమ వారికి ఇప్పుడు పెళ్ళి చేసే వివాహ వేడుకల్లో ఎన్ని వింతలో ఎన్నెన్ని విశేషాలో..ఈ ప్రేతాత్మల వేడుకల్లో ముందుగా అత్తింటివారిచ్చిన పట్టు వస్త్రాలను వధూవరులు ధరించాల్సి ఉంటుంది. పెట్టిపోతలయ్యాక పెళ్లి తంతు మొదలవుతుంది. వధూవరులుండరు. వారు కూర్చునే కుర్చీలపై తెల్లటి వస్త్రాలు కప్పి ఉంచుతారు. చనిపోయినవారి ఆత్మలు ఆ కుర్చీల్లో ఉంటాయని నమ్ముతారు.దాని చుట్టూ తిరుగుతూ వధూవరులు వేయాల్సిన ఏడడుగులను ఆ ఇంటి వాళ్లే వేసేస్తారు. తాళి, ఆశీస్సులు తదితర పెళ్లి కార్యక్రమాలు ఇక మామూలే. కేవలం కుటుంబ సభ్యులే కాదు స్థానికులు, బంధువులు, సన్నిహితులు కూడా ఈ వేడుకకు వస్తారు.

ప్పుడో పురిట్లో చచ్చిపోయిన వరుడికి (మగపిల్లాడు).పుట్టగానే ప్రసవంలోనే చనిపోయిన అమ్మాయిని (ఆడబిడ్డ)వెతికి మరీ పెళ్లి చేస్తారు. ఈ ప్రేతాత్మల పెళ్లిళ్లలో ఏడు తరాల సాంప్రదాయాల్ని చూడడం తప్పనిసరి. కులం, గోత్రం, వరుసలు అన్నీ సరిగ్గా కుదిరాకే పెళ్లికి రెడీ చేస్తారు. ఈ వీడియో జరుగుతోన్న ప్రేతాత్మల వయస్సు 30 ఏళ్లు. అంటే మూడు దశాబ్దాల క్రితం చనిపోయిన వారికి ఇప్పుడు పెళ్లిళ్లు చేస్తున్నారన్నమాట. ఇక వధూవరుల ప్రెసెన్స్‌ తప్ప విందులు, వినోదాలూ అన్నీ షరా మామూలే.పెళ్లి విందుల్లో నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే.

ఇందులో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే పెళ్లిళ్లు ఆత్మలకైనా మనుషులకైనా ఓ తీరుగా జరుగుతాయి. సంబంధం కుదుర్చుకునే ముందు వయస్సులో కొంచెం తేడావచ్చినా విషయం బెడిసికొడుతుంది. పెళ్లికూతురు ప్రేతాత్మ పెళ్లి కొడుకు ప్రేతాత్మకంటే కొంచెం పెద్దదయ్యిందని ఓ పెళ్లి పీటల దాకా వచ్చి పెటాకులైంది. ఇంతకీ విషయం ఏమిటంటే పెళ్లి కొడుకు వయస్సు కంటే పెళ్లి కూతురు వయస్సులో పెద్దదవడం వల్ల వరుడి తరపు బంధువులు ఆ పెళ్లిని తిరస్కరించారట. వధువు వరుడికన్నా ఒకటో రెండో రోజులు పెద్దది. అంటే పెళ్లికొడుకు కంటే ఒక్కరోజు ముందుగా పుట్టి చనిపోయిందన్న మాట…! ఇదండీ ప్రేతాత్మల పెళ్లి వేడులక వింతలు..విశేషాలు..