Uttarakhand : వరుడు తెచ్చిన ‘లెహంగా’ నచ్చలేదని పెళ్లి వద్దన్న వధువు

వివాహం సందర్భంగా కాబోయే కోడలికి మామ తెచ్చిన ‘లెహంగా’ ఏకంగా పెళ్లినే రద్దు చేసింది. వరుడు తండ్రి తెచ్చిన ‘లెహంగా’ నచ్చలేదని వధువు ఏకంగా పెళ్లే వద్దంది.

Uttarakhand : వరుడు తెచ్చిన ‘లెహంగా’ నచ్చలేదని పెళ్లి వద్దన్న వధువు

Bride who canceled wedding because she didn’t like lehenga

Uttarakhand : వివాహం సందర్భంగా  కాబోయే కోడలికి మామ తెచ్చిన ‘లెహంగా’ ఏకంగా పెళ్లినే రద్దు చేసింది. వరుడు తండ్రి తెచ్చిన ‘లెహంగా’ నచ్చలేదని వధువు ఏకంగా పెళ్లే వద్దంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. వరుడి తరపు వారు తెచ్చిన లెహంగా నచ్చలేదని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుందో వధువు.

కేవలం ఓ డ్రెస్సు కోసం ఏకంగా పెళ్లే వద్దంటుందా? తమ పరువు ఏమైపోవాలి? అంటూ మండిపడింది వరుడు కుటుంబం. దీంతో వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగింది. పెద్ద గొడవకు దారితీసింది. దీంతో ఇరు వర్గాల వారిలో ఎవ్వరూ తగ్గలేదు. దీంతో ఈ గొడవకాస్తా చివరికి పోలీసుల వద్దకు వెళ్లింది. ఇరు కుటుంబాలకు పోలీసులు నచ్చచెప్పారు. కానీ వధువు..ఆమె కుటుంబం మాత్రం మాకు ఈ పెళ్లి వద్దని తెగేసి చెప్పేశారు. దీంతో ఓ ‘లెహంగా’ కాస్తా పెళ్లి రద్దు అయ్యేలా చేసింది..!

హల్ద్వానీకి చెందిన యువతికి, అల్మోరాకు చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్ 5న వివాహానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వరుడి తరపు వారు శుభలేఖలు బంధుమిత్రులకు పంపుకున్నారు. ఈ క్రమంలో వధువు కోసం వరుడి తండ్రి లక్నో నుంచి ఖరీదైన లెహంగా తెప్పించి దానిని వధువుకి అందించారు.

ఆ లెహంగా చూసిన వధువు ముఖం చిట్లించింది. నాకు నచ్చలేదని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయం వరుడి ద్వారా వారి ఇంట్లో తెలిసింది. మేం పంపించిన డ్రెస్ బాగాలేదంటారా? ప్రత్యేకించి లక్నో నుంచి తెప్పించాం అంటూ వరుడు కుటుంబ సభ్యులు అన్నారు. దానికి మా అమ్మాయికి నచ్చలేదు మీరు ఎక్కడినుంచి తెప్పిస్తే ఏంటీ? అంటూ వధువు కుటుంబ సభ్యులు అన్నారు. దీంతో మధ్య గొడవ జరిగింది. ఇక లాభం లేదని..పెళ్లి జరిగేది లేదంటూ యువకుడి కుటుంబ సభ్యులు అక్టోబర్ 30న యువతి ఇంటికి వచ్చి ..లక్ష రూపాయలు ఇచ్చి వివాహాన్ని రద్దు చేసుకున్నారు.

దీంతో ఆ తర్వాత వధువు తరపు వారు యువకుడి ఇంటికి చేరుకుని మళ్లీ వివాహ ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో వారి మధ్య మరోవారు వాగ్వివాదం జరిగింది. చివరికి ఈ గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. దీంతో పెళ్లి రద్దు చేసుకున్నట్టు ఇరు కుటుంబాలు స్పష్టంచేశాయి. దీంతో చెప్పాల్సింది చెప్పాం..ఇక మీ ఇష్టం అంటూ పోలీసులు వారి పని వారు చూసుకున్నారు.

ఈరోజుల్లో వధువులు తాము ధరించే డ్రెస్సులపై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.ప్రత్యేకించి డిజైన్ చేయించుకుంటున్నారు. ఫోటో షూట్ లు ట్రెండ్ గా మారిపోయిన ఈరోజుల్లో డ్రెస్సులపై శ్రద్ధ తీసుకోవటం కూడా అంతే ట్రెండ్ అయిపోయింది. వివాహం అంటే ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఈ గుర్తులు జీవితాంతం గుర్తుండేలా చేసుకోవటానికి ఫోటోలు..వీడియోలు కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి అచ్చంగా సినిమాల్లా ఫోటో షూట్ లు సందడి చేస్తున్నాయి. వివాహం తీపి గుర్తుల్ని జీవితంతం ఉంచుకోవటానికి ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇదంతా బాగానే ఉంది. కానీ ఓ డ్రెస్ కోసం పెళ్లి రద్దు చేసుకోవటం మాత్రం వింతగా ఉంది.