Galla Jayadev On GST : పెట్రోల్‌, డీజిల్‌‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురండి- కేంద్రానికి టీడీపీ ఎంపీ కీలక సూచన

దేశంలో ధ‌ర‌ల నియంత్ర‌ణకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ప‌లు కీలక సూచ‌న‌లు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌ ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని కేంద్రానికి సూచించారు గల్లా జయదేవ్. బియ్యం, గోధుమ పిండి, పెరుగు, ల‌స్సీ త‌దిత‌రాల‌పై జులై 18 నుంచి విధించిన జీఎస్టీని త‌క్ష‌ణ‌మే ఎత్తివేయాల‌ని కోరారు.(Galla Jayadev On GST)

Galla Jayadev On GST : పెట్రోల్‌, డీజిల్‌‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురండి- కేంద్రానికి టీడీపీ ఎంపీ కీలక సూచన

Galla Jayadev

Galla Jayadev On GST : దేశంలో ధ‌ర‌ల నియంత్ర‌ణకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ప‌లు కీలక సూచ‌న‌లు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌ ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని కేంద్రానికి సూచించారు గల్లా జయదేవ్. ధర‌ల పెరుగుద‌ల‌పై సోమ‌వారం లోక్ స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో గ‌ల్లా జ‌య‌దేవ్ పాల్గొన్నారు.

GST : నేటి నుంచి జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు అమల్లోకి..సామాన్యులపై పెరుగనున్న భారాలు

బియ్యం, గోధుమ పిండి, పెరుగు, ల‌స్సీ త‌దిత‌రాల‌పై జులై 18 నుంచి విధించిన జీఎస్టీని త‌క్ష‌ణ‌మే ఎత్తివేయాల‌ని గ‌ల్లా జ‌య‌దేవ్ కోరారు. సోయాబీన్‌, ముడి స‌న్ ఫ్ల‌వ‌ర్ దిగుమ‌తుల‌పై 20 ల‌క్ష‌ల ట‌న్నుల దాకా ఎలాంటి దిగుమ‌తి సుంకాన్ని విధించ‌రాద‌ని కూడా ఆయ‌న సూచించారు. మార్కెట్ ఇంట‌ర్‌వెన్ష‌న్ స్కీంను అమ‌లు చేయ‌డం ద్వారా ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు కృషి చేయాల‌న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపు చేసేందుకు ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కోరారు. ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు తాను చేసిన సూచ‌న‌ల‌ను కేంద్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు జ‌య‌దేవ్ చెప్పారు.(Galla Jayadev On GST)

Rice Bags GST : వాటాన్ ఐడియా.. రైస్ బ్యాగులపై GST పడకుండా మిల్లర్ల సరికొత్త ప్లాన్

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయ్యింది దేశంలోని సామాన్యుల పరిస్థితి. ఇప్పటికే పెరిగిన ధరలతో జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు జీఎస్టీలో తెచ్చిన మార్పులతో సామాన్యులపై మరింత భారం పడింది. బ్యాంకుల నుంచి చెక్ బుక్ తీసుకోవాలన్న 18 శాతం జీఎస్‌టీ పడుతుంది. ఆసుపత్రుల్లో చికిత్స కూడా కాస్ట్లీ అయ్యింది. రోజుకు 5వేల కంటే ఎక్కువ అద్దె ఉన్న ఆసుపత్రుల నాన్-ఐసియు గదులకు 5% GST చెల్లించాల్సి ఉంటుంది. హోటల్స్ రూమ్స్ ధరలూ పెరగనున్నాయి. రోజుకు రూ. 1000 లోపు రెంట్‌ కలిగిన హోటల్ రూమ్స్‌పై 12 శాతం జీఎస్‌టీ విధించారు. ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్‌, ఎల్ఈడీ లైట్లు, ఎల్ఈడీ ల్యాంప్స్‌పై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలి.

ఇక ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తుల ధరలూ పెరిగాయి. అప్పడాలు, జంతికలు, మిక్చర్ నుంచి ఆటా(పిండి), బియ్యం, గోధుమ‌లు, పెరుగు, మ‌జ్జిగ‌, ల‌స్సీ, ప‌న్నీర్‌, బెల్లం, తేనె వరకు అన్నింటిపై 18 శాతం జీఎస్టీ ఫిక్స్ చేశారు. మ్యాప్‌లు, చార్ట్‌లు, అట్లాస్‌ల కొనలన్నా 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్య జనంపై కేంద్రం ఇప్పుడు జీఎస్టీ రూపంలో మరో భారం వేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. ధరల పెరుగుదలపై పోరాటాలకు సిద్ధమవుతున్నాయి.