Arvind Kejriwal: “కన్నీళ్లు తెప్పించారు” భగవత్ మన్ నిర్ణయంపై కేజ్రీవాల్ కామెంట్

రీసెంట్‌గా పంజాబ్ రాష్ట్ర మంత్రి అయిన విజయ్ సింగ్లాను అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పించారు సీఎం భగవత్ మన్. ఈ నిర్ణయానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నుంచి కాంప్లిమెంట్లు దక్కించుకున్నారు భగవత్.

Arvind Kejriwal: “కన్నీళ్లు తెప్పించారు” భగవత్ మన్ నిర్ణయంపై కేజ్రీవాల్ కామెంట్

Kezriwal (1)

Arvind Kejriwal: రీసెంట్‌గా పంజాబ్ రాష్ట్ర మంత్రి అయిన విజయ్ సింగ్లాను అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పించారు సీఎం భగవత్ మన్. ఈ నిర్ణయానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నుంచి కాంప్లిమెంట్లు దక్కించుకున్నారు భగవత్. ఈ ఘటన తనకు కన్నీళ్లు వచ్చేలా చేసిందని చెప్తున్నారు.

ఆరోగ్య మంత్రిగా ఉన్న విజయ్ సింగ్లాను పదవి నుంచి తప్పించగానే అరెస్ట్ చేశారు. టెండర్లను క్లియర్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

“భగవంత్ మీరు చేసిన పనికి గర్వపడుతున్నాను. నాకు కన్నీళ్లను తెప్పించింది. ఈ రోజు దేశం మొత్తం ఆప్ గురించి గర్విస్తోంది” అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ చర్యను ప్రశంసిస్తూ వీడియోను పోస్ట్ చేశారు.

Read Also: ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై సీబీఐ దాడులు.. భారీగా నగదు స్వాధీనం

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత 2015లో అవినీతి ఆరోపణలు వచ్చిన నెపంతో ఒక మంత్రిని ఇలాగే పదవి నుంచి తప్పించారు. ఆప్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీఎంగా భగవత్ ఈ మంత్రి గురించి కఠిన నిర్ణయం తీసుకున్నారు.

“ఇటీవల నాకొక ఫిర్యాదు వచ్చింది. నా ప్రభుత్వంలోని ఒక మంత్రి ప్రతి టెండర్‌కు 1% కమీషన్ డిమాండ్ చేస్తున్నారు. దానిని చాలా సీరియస్‌గా తీసుకున్నా. దీని గురించి ఎవరికీ తెలియలేదు, నేను కోరుకున్నట్లయితే, దానిని ఎవరికీ తెలియకుండా చేయొచ్చు. నాపై విశ్వాసం ఉంచిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు అవుతుంది’’ అని వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

“ఒక శాతం అవినీతిని కూడా సహించబోం. ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓటు వేశారు, దానికి అనుగుణంగా జీవించాలి. భారతమాతకి అరవింద్ కేజ్రీవాల్ వంటి కుమారుడు, భగవంత్ మాన్ వంటి సైనికుడు ఉన్నంత వరకు, అవినీతిపై మహా యుద్ధం కొనసాగుతుంది.” అని మిస్టర్ మన్ అన్నారు.

Read Also: ఆప్ సీఎం అభ్యర్థి.. పార్టీకి రాజీనామా

అనేక మంది AAP నాయకులు దీనిపై ప్రశంసలు గుప్పించారు. “అవినీతిని సహించని పార్టీ” అని అభివర్ణిస్తున్నారు. సొంత వారిపై చర్య తీసుకునే చిత్తశుద్ధి, ధైర్యం, నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ ఆప్ మాత్రమే అని రాఘవ్ చద్దా అన్నారు.