MLA Rajaiah Vs Women Sarpanch : మహిళా సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య

వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు.

MLA Rajaiah Vs Women Sarpanch : మహిళా సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య

brs mla tatikonda rajaiah is harassmets allegation of woman sarpanch

MLA Rajaiah Vs Wome Sarpanch : వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొంతమంది నాపై కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నేను ఎవ్వరికి ఫోన్లు చేయలేదు..ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తెలిపారు.

Telangana : ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారు,చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారు : మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

నాపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఇటువంటి కుట్రలు నాపై జరగటం తొలిసారి కాదని గతంలో కూడా జరిగాయని చెప్పుకొచ్చారు తాటికొండ రాజయ్య. నాపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలో భాగమని గత ఎన్నికల్లో చేసినట్లుగానే ఇప్పుడు కూడా నాపై కుట్రలు చేస్తున్నారని నాపై వచ్చిన ఈ ఆరోపణల గురించి స్వయంగా సీఎం కేసీఆర్ ను..కలిసి అన్నీ వివరిస్తానని తెలిపారు. ఇంటి దొంగలే శిఖండులగా మారి నాపై ఇటువంటి కుట్రలు చేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలను చూస్తున్నారని చెప్పుకొచ్చారు రాజయ్య. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణకు సహించలేని కొంతమంది చేసే కట్ర అంటూ కొట్టిపారేశారి ఎమ్మెల్యే రాజయ్య.