India-Bangladesh: ఇద్దరు బంగ్లాదేశ్ స్మగ్లర్లను కాల్చి చంపిన బీఎస్ఎఫ్ సిబ్బంది

బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరిని భారత సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్చి చంపారు. జంతువుల తలలను వారు స్మగ్లింగ్ చేస్తున్నారని, లొంగిపోవాలని ఎంతగా హెచ్చరికలు చేసినప్పటికీ స్మగ్లర్లు వినిపించుకోలేదని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. స్మగ్లర్లు బీఎస్ఎఫ్ సిబ్బందిపై పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారని చెప్పింది. దీంతో స్మగ్లర్లపై కాల్పులు జరిపామని ఇద్దరు మృతి చెందారని వివరించింది.

India-Bangladesh: ఇద్దరు బంగ్లాదేశ్ స్మగ్లర్లను కాల్చి చంపిన బీఎస్ఎఫ్ సిబ్బంది

India-Bangladesh: బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరిని భారత సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది కాల్చి చంపారు. జంతువుల తలలను వారు స్మగ్లింగ్ చేస్తున్నారని, లొంగిపోవాలని ఎంతగా హెచ్చరికలు చేసినప్పటికీ స్మగ్లర్లు వినిపించుకోలేదని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. స్మగ్లర్లు బీఎస్ఎఫ్ సిబ్బందిపై పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారని చెప్పింది. దీంతో స్మగ్లర్లపై కాల్పులు జరిపామని ఇద్దరు మృతి చెందారని వివరించింది.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్, కైమారీలో చోటుచేసుకుందని తెలిపింది. భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్ వైపుగా 15-20 మంది దుండగులు సంచరిస్తున్నట్లు గుర్తించిన బీఎస్ఎఫ్ వారిపై నిఘా ఉంచింది. వారు అక్రమంగా జంతువుల తలలతో భారత్ లోకి ప్రవేశించాలని ప్రణాళికలు వేసుకున్నట్లు గుర్తించింది.

వారికి భారత్ లోని పలువురు సాయం చేస్తున్నట్లు నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో వారిని పట్టుకోవడానికి వెళ్లిన బీఎస్ఎఫ్ సిబ్బందిపై స్మగ్లర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడంతో వారిని జవాన్లు బుద్ధి చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..