Budget 2021: సీతమ్మ కట్టుకున్న‘తెల్లంచు ఎర్ర చీర’వెనక ‘బెంగాల్ దంగల్’ కారణమా?

Budget 2021: సీతమ్మ కట్టుకున్న‘తెల్లంచు ఎర్ర చీర’వెనక ‘బెంగాల్ దంగల్’ కారణమా?

Budget 2021 : Sitharaman’s Saree  Bengal dangal Laal-Paad : బడ్జెట్ 2021 : కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టటానికి చాలా స్పెషల్ లుక్ తో కనిపించారు. సీతమ్మ కట్టుకున్న ‘తెల్లంచు ఎర్రచీర’ కట్టుకోవటానికి వెనక కారణమేంటి? అని అందరూ ఆలోచిస్తున్నారు.ఈ ‘‘తెల్లంచు ఎర్రచీర’’ సీతమ్మ ఏదో క్యాజువల్ గా కట్టుకున్నట్లుగా లేదనిపిస్తోంది. దీని వెనుక అసలు కారణం ‘బెంగాల్ దంగల్’ కారణమేననిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జెండా ఎగురవేయాలనే కసితో ఉంది.

దీంట్లో భాగంగానే పశ్చిమబెంగాల్లో బీజేపీ అగ్రనేతలు పాగా వేశారు. సీఎం మమతా బెనర్జీకి షాకులమీద షాకులిస్తున్నారు. వీలు దొరికొనప్పుడల్లా దీదీపై విరుచుకుపడుతున్నారు. త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి షాకుల మీద షాకులు ఇస్తోంది బీజేపీ. బెంగాల్ ను దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ పలు చర్యలు తీసుకుంటోంది. కమ్యూనిస్టులు కంచుకోటను బద్దలు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నారు మమతా బెనర్జీ.

ఇక దీదీని మట్టికరిపించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాషాయదళం కాచుకుని కూర్చుంది. దీనికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటోంది.దేన్నీ వదలటంలేదు. త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో కమల నేతలు అధికారం కోసం గట్టి పట్టుదలగా ఉన్నారు. బెంగాల్ ను దక్కించుకుంటాం అనే దానికి సూచికగా మంత్రి సీతమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టటానికి ఫుల్ రెడ్ కలర్ తో ఎంట్రీ ఇచ్చారు. ఎర్రటి ట్యాబ్, తెల్లంచుగల ఎర్రటి చీరతో ప్రత్యేకమైన లుక్ తో సీతమ్మ చీర ఆలోచింపజేస్తోంది.

అసలు నిర్మలా సీతారామన్ ‘తెల్లంచు ఎర్రచీర’తో ఎందుకు వచ్చారో మనకు తెలియాలి. తెలిసి తీరాలి. ఎందుకంటే ఆమె ఏదో సాదాసీదాగా…ఏదో ఒక చీర కట్టుకోవాలి. కానీ ఈ బడ్జెట్ లో స్పెషల్ గా కనిపిస్తు పలువురిని ఆలోచనలో పడేశారు సీతమ్మ. ఆ తెల్లంచు ఎర్ర చీరలో కూడా ఓ ప్రత్యేకత ఉంది. అదే ‘బెంగాల్ దంగల్’. త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ ను దక్కించుకునే పనిలో ఉన్న బీజేపీ ఆలోచనలే దీనికి కారణం అనేలా ఉంది.

ఈ సారి లోక్‌సభలో కాగితాల రూపంలో బడ్జెట్ లేకపోవడం ఒక హైలెట్ అయితే..దానికి తోడు మంత్రి నిర్మల సీతారామన్… ఓ టాబ్లెట్ కంప్యూటర్‌ని బడ్జెట్ ప్రసంగించారు. ఆ టాబ్లెట్ కంప్యూటర్ తయారైనది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌తో. అలాగే తెల్లంచు ఎర్ర చీర మరో హైలెట్ గా నిలిచింది. ఇదంతా బెంగాల్ దంగల్ కోసమే అన్నట్లుగా ఉంది.

పశ్చిమ బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవటానికి కాషాయ అగ్రనేతలు వీలు దొరికినప్పుడల్లా బెంగాల్ లో వాలిపోతున్నారు. దీదీపై విమర్శలు తీవ్రంగా చేస్తున్నారు. ఇక బెంగాల్ ప్రజలను ఆకట్టుకోవడానికి వీలైన అన్ని అస్త్రాలనూ బీజేపీ వాడేసుకుంటోంది. ఈమధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ… కోల్‌కతా వెళ్లినప్పుడు జైశ్రీరామ్ నినాదాలతో దీదీకి టెంపర్ లేపారు.

ఇక తాజాగా… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కట్టుకున్న ‘తెల్లంచు ఎర్రచీర’ వెనక కూడా ఈ బెంగాల్ దంగలే దాగి ఉందని అర్థమవుతోంది. అది మామూలు చీర కాదు. బెంగాల్‌లో ఆ చీరను లాల్ పాడ్ (Laal Paad) అంటారు. అంటే… ‘తెల్లంచు ఎర్రచీర’ అన్నమాట. ఆ చీరలు బెంగాల్ మహిళలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. వాటిని కాళీమాతకు కానుకగా సమర్పిస్తారు. ఏవైనా పుణ్య కార్యాలు జరిగేటప్పుడు కూడా ఆ చీరలు ధరిస్తారు.

పండుగలు, వేడుకల సమయంలో ఆ చీరలే ప్రత్యేకం. ఇప్పుడు సీతమ్మ కూడా ఆ చీరను ధరించడం ద్వారా బెంగాల్ ప్రజల మనసు దోచుకోవటానికే అనుకోవచ్చు. చివరకు చీరలో కూడా ఎన్నికల వ్యూహం ఉండటం చూస్తుంటే… బెంగాల్‌పై కమలదళం ఏ స్థాయిలో స్కెచ్ వేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు…అదన్న మాట సీతమ్మ తెల్లంచు ఎర్ర చీర వెనుక అసలు అర్థం ‘బెంగాల్ దంగల్’..