బడ్జెట్ 2021-22.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

బడ్జెట్ 2021-22.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

budget 2021 mobile phones, electronic goods prices to go up: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో సామ్యానుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్రం భారీ షాక్ మాత్రం ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై వ్యవసాయ సెస్సు విధిస్తూ ప్రతిపాదనలు చేసింది. దీంతో చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. కాగా, బడ్జెట్‌తో కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. మరి ధర పెరిగేవి ఏవో.. తగ్గేవి ఏవో ఓసారి చుద్దాం.

ధరలు పెరిగేవి..

* ఎలక్ట్రానిక్ వస్తువులు (ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్)

* మొబైల్ ఫోన్స్(ఇంపోర్టు డ్యూటీ 2.5 పెంపు)

* చార్జర్లు(దిగుమతి చేసుకునే)

* రత్నాలు

* పెట్రోల్, డీజిల్

* దిగుమతి చేసుకునే కాటన్ దుస్తులు, వంట నూనె, ఆటో విడి భాగాలు

* సోలార్ ఇన్వర్టర్లు

* కార్లు, కార్ల విడి భాగాలు

* లెదర్‌ ఉత్పత్తులు

* స్టీలు స్క్రూలు(10 నుంచి 15 శాతానికి పెంపు)

* రా సిల్స్‌, యాన్‌ సిల్క్‌(10 నుంచి 15 శాతానికి పెంపు)

* ఆల్కహాలిక్‌ బెవెరేజెస్‌

* క్రూడ్‌ పామాయిల్‌

* క్రూడ​ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌

* ఆపిల్స్‌

* బొగ్గు, లిగ్నైట్‌, పిట్‌

* యూరియా తదితర ఫర్టిలైజర్లు

* బఠాణీలు

* కాబూలీ శనగలు

* బెంగాల్‌ గ్రాం

* పప్పులు

ధరలు తగ్గేవి..

* ఐరన్

* స్టీల్

* నైలాన్ క్లాత్స్

* కాపర్ ఐటమ్స్

* ఇన్సూరెన్స్

* షూస్(లెదర్ షూస్ కాదు)

* డ్రై క్లీనింగ్

* వెండి

* బంగారం

* నాప్తా(హైడ్రోకార్బన్‌ లిక్విడ్‌ మిక్చర్‌)

* వ్యవసాయ ఉత్పత్తులు

ఆర్థిక బడ్జెట్‌ వివరాల ప్రకారం దిగుమతి చేసుకున్న మొబైల్‌ ఫోన్లు, ఛార్జర్ల ధరలు పెరగనున్నాయి. ఆయా వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ ఐదు నుంచి పది శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడమే ధరల పెరుగుదలకు కారణం. ఈ నిర్ణయం వల్ల ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని అనలిస్టులు అంటున్నారు. ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మదర్‌బోర్డ్‌లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి, మొబైల్‌ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్‌ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్‌ వెల్ఫేర్‌ సెస్‌ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు.

బడ్జెట్ 2021లో కాటన్‌పై 10శాతం కస్టమ్స్‌ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అదే విధంగా లెదర్‌ ఉత్పత్తులు, సోలార్‌ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్‌ రంగంలో కస్టమ్‌ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. అదే విధంగా రాగిపై పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా అక్టోబర్‌ 21 నుంచి కొత్త కస్టమ్స్‌ పాలసీ అమల్లోకి రానుంది.