Tamil Nadu: బస్టాప్‌లో ఆగని బస్సు.. డ్రైవర్, కండక్టర్ సస్పెన్షన్.. ఎందుకంటే?

బస్సును బస్టాప్‌లో ఆపకుండా స్టాపుకు దూరంగా ఆపడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

Tamil Nadu: బస్టాప్‌లో ఆగని బస్సు.. డ్రైవర్, కండక్టర్ సస్పెన్షన్.. ఎందుకంటే?

Bus in Tamil Nadu

Tamil Nadu: బస్సును బస్టాప్‌లో ఆపకుండా స్టాపుకు దూరంగా ఆపడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. బస్సు స్టాపులో ఆపనందుకే డ్రైవర్, కండక్టర్‌ను సస్పెండ్ చేయాలా? అని మీకు డౌట్ రావొచ్చు. కానీ, అసలు విషయం తెలిస్తే.. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపం బేగేపల్లికి చెందిన గోపాలకృష్ణన్ ఆటో డ్రైవర్. అతను గత సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో వినతిపత్రం ఇవ్వడానికి హోసూర్ నుంచి భార్య, తన మానసిక దివ్యాంగ కుమారుడు హరిప్రసాద్ తో కలిసి బస్సులో వస్తున్నాడు.

Viral Video: బీచ్‌లో బికినీలతో అందగత్తెలు సందడి చేస్తుంటే.. చీరకట్టులో మహిళ ఎంట్రీ.. కళ్లన్నీ అటువైపే

బస్సు కలెక్టరేట్ కు కొద్ది సేపట్లో చేరుకుంటుందన్న సమయంలో బస్సు కండక్టర్ వద్దకు వెళ్లి కలెక్టర్ కార్యాలయం సమీపంలో బస్సు ఆపాలని గోపాల్‌కృష్ణన్ విజ్ఞప్తి చేశాడు. అయితే అందుకు కండక్టర్ ఒప్పుకోలేదు. బస్సు బ్రిడ్జిపై నుంచి వెళ్తుందని, బ్రిడ్జి ప్రారంభంలో బస్సు ఆగుతుందని, అక్కడే దిగాలని గోపాలకృష్ణన్ కు సూచించాడు. పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బస్సు కండక్టర్, డ్రైవర్ బస్సును బ్రిడ్జి ప్రారంభంలో ఆపుతామని, బ్రిడ్జిపై బస్సు ఆగదని తెలిపాడు. దీంతో చేసేదేమీలేక కలెక్టరేట్ కార్యాలయం వద్ద బస్టాప్ కు ఒకటిన్నర కి.మీ దూరంలోనే బస్సు దిగాల్సి వచ్చింది.

Viral Video : కరెంట్ పోల్ పై మహిళ విన్యాసాలు- వైరల్ వీడియో

దీంతో మానసిక దివ్యాంగుడైన కుమారుడ్ని గోపాలకృష్ణ మోసుకుంటూ కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని పిటీషన్ ఇచ్చాడు. గోపాలకృష్ణ తన దివ్యాంగ కుమారుడిని మోసుకొని వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందుకు బాధ్యులైన బస్సు డ్రైవర్, కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. అయితే అసలు విషయం తెలుసుకొనేందుకు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. కండక్టర్, డ్రైవర్ బస్సును స్టాప్ కు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఆపడంతో వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.