‘బతుకు బస్టాండే’నంటూ బ్యాచిలర్ బాబులకు నితిన్ హితబోధ..

‘బతుకు బస్టాండే’నంటూ బ్యాచిలర్ బాబులకు నితిన్ హితబోధ..

Bus Stande Lyrical: యూత్ స్టార్ నితిన్‌, టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తీ సురేష్ జంటగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ఆకట్టుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పకులు..

Rang De

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా ‘బస్టాండే’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Rang De

దేవి ట్యూన్ కి శ్రీ మణి లిరిక్స్ రాశారు. డీఎస్పీ బ్రదర్ సాగర్ పాడారు.. పెళ్లి ఫిక్స్ అయిన హీరో ఆఫ్టర్ మ్యారేజ్ బతుకు బస్టాండే నంటూ బ్యాచిలర్ బాబులకు హితబోధ చేస్తున్నట్లు సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. మార్చి 26న ‘రంగ్ దే’ ప్రేక్షకుల ముందుకు రానుంది.