వావ్..ప్యాంటూ..షర్ట్ వేసుకున్న ఏనుగు.. ‘ఎలీ-ప్యాంట్’..ఫన్నీ పిక్ వైరల్..

వావ్..ప్యాంటూ..షర్ట్ వేసుకున్న ఏనుగు.. ‘ఎలీ-ప్యాంట్’..ఫన్నీ పిక్ వైరల్..

elephant wearing shirt and pants : ఓ ఏనుగు ప్యాంటు, షర్టూ వేసుకుంది. తోక ఊపుకుంటూ వీధుల్లో దర్జాగా తిరుగుతోంది. అదేంటీ ఏనుగు ప్యాంటు, షర్టూ వేసుకోవటమేంటి? దానికి ఎంత క్లాత్ పడుతుంది? తక్కువేమీ కాదే..ఓ తాను క్లాత్ సరిపోతుందా? అనే పిచ్చి డౌట్లు పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఎన్నో టాలెంటెడ్ ఫోటోలు షేర్ చేస్తుంటారు. ఈ క్రమంప్యాంటు, షర్టూ వేసుకున్న ఏనుగు ఫోటోను ఆనంద్ మహేంద్రా షేర్ చేశారు. ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అంతకంటే ఫన్నీ కామెంట్ పెడుతున్నారు? ఆ షర్ట్, ప్యాంట్ వేసిన ఏనుగురే కంఫర్ట్ గా ఉందా? అంటూ జోకులేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆనంద్ మహేంద్రా తన దృష్టికి వచ్చిన ఇంట్రెస్టిక్ విషయాలను షేర్ చేస్తుంటారు దేశసమకాలీన పరిస్థితులనుంచి ఫన్నీ విషయాలపై కూడా ఆయన భలే భిన్నంరీతిలో స్పందిస్తారు. తాజాగా.. మరో ఆసక్తికర ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈసారి అందంగా అలకరించిన ఏనుగు ఫొటోను మహీంద్రా తన ట్విటర్‌లో షేర్‌ చేయడం విశేషం. ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా. ఎలీ-ప్యాంట్‌’ అంటూ చొక్కా, ప్యాంటు ధరించిన ఏనుగు ఫోటోను పోస్ట్‌ చేసి క్యాప్షన్ జోడించారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫొటోలో ఏనుగు పర్పుల్‌ కలర్‌ షర్ట్‌, వైట్‌ కలర్ ప్యాంట్‌తో పాటు బ్లాక్‌ బెల్టు కూడా పెట్టుకుని ఉంది. అలా చక్కగా ముస్తాబైన ఆ ఏనుగు మావటి వెనకాలే చాలా బుద్దిగా నడుస్తూ వెళ్తోంది. ఈ ఫొటో ఎక్కడిది?అనేది అనవసరం..ఫన్నీగా ఉంది ఉంది కాబట్టి మనసారా ఆస్వాదించాలంతే..ప్రస్తుతం ప్యాంటు, షర్టూ వేసుకున్న ఏనుగు ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే వేలాది లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు సరదా కామెంట్లు, ఫన్నీ మీమ్స్‌తో హల్‌చల్‌ చేస్తున్నారు. ఏనుగుకు ప్యాంట్‌…మావటికి లుంగీ అంటూ ఒక యూజర్‌ కామెంట్‌ చేశారు. ప్యాంట్‌లో ఏనుగు కంఫర్ట్‌గా ఉందా అంటూ మరొకరు..ఇలా పలు రకాలుగా స్పందించారు.