లైఫ్ రిస్క్ : బీర్లు కొంటున్నారా..అయితే Date చెక్ చేసుకోండి

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 05:18 AM IST
లైఫ్ రిస్క్ : బీర్లు కొంటున్నారా..అయితే Date చెక్ చేసుకోండి

తలపైన సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఒక్కటే ఉక్కపోత. చల్లచల్లగా ఓ బీర్ వేస్తే ఏం అవుతది..అని అనుకుంటుంటారు మందుబాబులు. వెంటనే వైన్స్ షాపుకు వెళ్లి..బీర్లు తీసుకుని..గట గటా త్రాగేస్తుంటారు. కానీ…ఏం మాత్రం అజాగ్రత్తగా ఉన్నా..మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే. ఏంటీ బీరు తాగితే..ప్రమాదమా ? అని ఆశ్చర్యపోతున్నారా ? అసలు విషయం తెలుసుకోవడానికి చదివేయండి. 

కరోనా కారణంగా…కేంద్రం విధించిన లాక్ డౌన్ తో అన్నీ బంద్ అయిపోయాయి. దాదాపు 40 రోజులకు పైగా కొనసాగిన లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. అందులో రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరైన ఎక్సైజ్ శాఖ కూడా ఉంది. వైన్స్ షాపులు తెరుచుకోవచ్చని..కొన్ని కండీషన్స్ పెట్టింది. దీంతో మందు బాబులు ఫుల్ ఖుష్ అయిపోయారు. మార్చి 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన మందు దుకాణాలు 2020, మార్చి 06వ తేదీన తెరుచుకున్నాయి.

కానీ..ఇక్కడే..ఓ విషయం దాగి ఉంది. బీర్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గడువు ముగిసిన బీర్లను కూడా విక్రయిస్తూ..ప్రాణాలతో ఆడుకుంటున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇది ఎక్కువగా ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని వైన్ షాపు యజమానులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. డేట్ ఎక్స్ పైర్ అయిన బీర్లను తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వెంటనే ఎక్సైజ్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.