Crude Oil Sale: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

కేంద్ర కేబినెట్ ఇవాళ‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయ క్రూడాయిల్ ఉత్పత్తి అమ్మ‌కాల‌పై నియంత్రణను ఎత్తివేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణ‌యం అమల్లోకి రానుంది.

Crude Oil Sale: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

Oil2

Crude Oil Sale: కేంద్ర కేబినెట్ ఇవాళ‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయ క్రూడాయిల్ ఉత్పత్తి అమ్మ‌కాల‌పై నియంత్రణను ఎత్తివేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణ‌యం అమల్లోకి రానుంది. దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురును ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయించాలన్న నిబంధన ఉండ‌బోద‌ని కేంద్ర‌ కేబినెట్ స్ప‌ష్టం చేసింది. చమురును అన్వేషించి ఉత్పత్తి చేసిన కంపెనీలు దేశీయంగా ఎక్కడైనా క్రూడాయిల్ అమ్ముకునే వెసులుబాటు క‌ల్పించింది.

Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధ‌వ్‌కు గ‌వ‌ర్న‌ర్ లేఖ‌

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రాయల్టీ, సెస్ ఏకరీతిన కొనసాగుతుంది. దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురు ఎగుమతిపై నిషేధం కూడా కొనసాగనుంది. దేశీయ అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడ్డామని, కేవలం 15 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరుగుతోందని కేంద్రం గుర్తు చేసింది. రానున్న రోజుల్లో దిగుమతుల భారాన్ని తగ్గించుకుని, దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిని పెంచుకోవడం, ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాల‌ని చెప్పింది.

Maharashtra: ‘రేపు బ‌ల‌ప‌రీక్ష ఉంది.. బెయిల్ ఇవ్వండి’ అంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మాలిక్, దేశ్‌ముఖ్

ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల (పీఏసీఎస్) కంప్యూటరీక‌ర‌ణకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దేశంలోని 63,000 పీఏసీఎస్‌ల‌ కంప్యూటరీకరణకు మార్గం సుగమమైంది. కంప్యూటరీకరణ కోసం రూ.2,516 కోట్లు ఖర్చు చేయ‌నుంది. మొత్తంగా దేశంలోని 13 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం క‌ల‌గ‌నుంది.