Mainpuri Bypoll: అఖిలేశ్ యాదవ్‌ను ‘చోటే నేతాజీ’ అని పిలవండి: శివపాల్ యాదవ్

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, తన సోదరుడి కుమారుడు అఖిలేశ్ యాదవ్ ను ‘చోటే నేతాజీ’ అని పిలవాలని ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. అఖిలేశ్ తండ్రి, దివంగత మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ను నేతాజీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. తాజాగా, గతంలో అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో శివపాల్ సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు వారిద్దరు కలిసిపోయారు.

Mainpuri Bypoll: అఖిలేశ్ యాదవ్‌ను ‘చోటే నేతాజీ’ అని పిలవండి: శివపాల్ యాదవ్

Mainpuri Bypoll:

Mainpuri Bypoll: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, తన సోదరుడి కుమారుడు అఖిలేశ్ యాదవ్ ను ‘చోటే నేతాజీ’ అని పిలవాలని ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. అఖిలేశ్ తండ్రి, దివంగత మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ను నేతాజీ అని పిలిచేవారన్న విషయం తెలిసిందే. తాజాగా, గతంలో అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో శివపాల్ సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు వారిద్దరు కలిసిపోయారు.

ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురీ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇందులో అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. జశ్వంత్ నగర్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అఖిలేశ్ తో కలిసి శివపాల్ సింగ్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.

New Zealand vs India: మూడో వన్డే వర్షార్పణం.. 1-0 తేడాతో భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్

‘‘ఇక్కడ నేతాజీ ములాయం సింగ్ యాదవ్ వంటి నేత మరొకరు ఎవరూ లేరని అఖిలేశ్ యాదవ్ అన్నారు. మెయిన్ పురీ ప్రజలు అఖిలేశ్ యాదవ్ ను పెద్ద మంత్రి అని పిలిచేవారు. నేను మాత్రం చిన్న మంత్రి అని పిలిచేవాడిని. ఇప్పుడు అఖిలేశ్ ను మీరు చోటే నేతాజీ అని పిలవాలని సూచిస్తున్నాను. డింపుల్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి’’ అని శివపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రచార కార్యక్రమంలో తమ ఐక్యతను చాటుకోవడానికి అఖిలేశ్ యాదవ్, డింపుల్ యాదవ్ కలిసి శివపాల్ యాదవ్ కాళ్లకు నమస్కరించారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..