కాలువలోకి పేక మేడలా కుప్పకూలిన 3 అంతస్తుల భవనం 

  • Published By: srihari ,Published On : June 13, 2020 / 02:00 PM IST
కాలువలోకి పేక మేడలా కుప్పకూలిన 3 అంతస్తుల భవనం 

నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఇరిగేషన్ కాలువ పక్కనే నిర్మిస్తోన్న భవనం చూస్తుండగానే పేక మేడలా కుప్పకూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో శనివారం (జూన్ 13) ఉదయం బెంగాల్ వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది. కోల్‌కతాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాస్‌పూర్ బ్లాక్‌లోని నిస్చింటాపూర్ గ్రామంలో భవనం కూలిపోయింది. 30 సెకన్ల వీడియోలో రాష్ట్ర నీటిపారుదల కాలువలోకి పడిపోయింది. 

భవన నిర్మాణం పక్కనే కాలువలో పనుల కారణంగా దాని పునాది బలహీనపడింది. దాంతో నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది. నివేదికల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షాలతో ఫౌండేషన్ స్థిరత్వాన్ని మరింత ప్రభావితం చేసింది.

ఈ భవనం నీటిపారుదల కాలువకు చాలా దగ్గరగా ఉండటంతో కూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, ఇది చట్టవిరుద్ధమైన నిర్మాణమని స్థానికులు అంటున్నారు. భవనం కూలిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.