lose weight : పన్నీర్ తింటే బరువు తగ్గొచ్చా?

పన్నీర్ లో క్యాల్షియం అధిక మొత్తంలో ఉండటంవల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవడానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. 100 గ్రాముల పనీర్‌లో 83 గ్రా కాల్షియం ఉన్నట్లు గుర్తించారు.

lose weight : పన్నీర్ తింటే బరువు తగ్గొచ్చా?

Paneer

lose weight : పన్నీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారంగా చెప్పవచ్చు. దీనిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడంతోపాటు..బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. అలాగే పిల్లలకు పోషకాహరంగానూ ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో పెరుకుపోయిన కొవ్వును తొలగించడంలోనూ పన్నీర్ ఎక్కువగా సహయపడుతుంది. పాల పదార్థాలలో ఒకటైనా పన్నీర్ ను వివిధ రకాల వంటలలో ఉపయోగించడం చేస్తుంటాము.

పన్నీర్ లో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే తరుచూ పన్నీరు తినడం ద్వారా మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడమే కాకుండా పిల్లల ఎదుగుదలకు, పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 100 గ్రాముల కాటేజ్ చీజ్‌లో 11 గ్రా ప్రోటీన్ ఉంటుందని వెల్లడైంది. ముఖ్యంగా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం కోసం పన్నీరు దోహదపడుతుందని చెప్పవచ్చు.

ఇందులో ఐరన్ లెవల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్లతో పాటు అధిక మొత్తంలో కొవ్వులు కూడా ఉంటాయి. ఆవుపాలలో కేసిన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్ ఉపయోగించడం ఎంతో ఉత్తమం. వీటిలో ప్రొటీన్లు కొవ్వులతోపాటు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో పిండిపదార్థాలను సులభంగా వేరు చేయబడుతుంది. అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలను మీరు ఎక్కువగా తిన్నప్పుడు.. పన్నీరు మీ బరువు తగ్గించడంలో భాగంగా కొవ్వును కరిగించటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

పన్నీర్ లో క్యాల్షియం అధిక మొత్తంలో ఉండటంవల్ల ఎముకలు దంతాలు దృఢంగా తయారవడానికి పన్నీర్ ఎంతగానో దోహదపడుతుంది. 100 గ్రాముల పనీర్‌లో 83 గ్రా కాల్షియం ఉన్నట్లు గుర్తించారు. ఇది మన శరీరానికి అవసరమైన దానికంటే 8 శాతం ఎక్కువ. బరువు తగ్గించడమే కాదు.. జీవక్రియను పెంచడంలో కూడా పనీర్ సహాయపడుతుంది. పనీర్‌‌‌లో ఫొలేట్ పుష్కలం గా ఉండి ఎర్రరక్తకణాలను పెంచుతుంది. ఫోలేట్ బి కాంప్లెక్స్ విటమిన్ గర్భంలో ఉన్న పిండాభివృద్ధి కి తోడ్పడుతుంది.

ఒకటి శరీరానికి కావాల్సిన పోషకాలను పన్నీర్ అందిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలోనూ సహయపడుతుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గడానికి, అలాగే ఇందులో ఉన్నటువంటి పోషకాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ప్రత్యేకంగా ఆవుపాలతో చేసిన పనీర్ లో చాలా అధిక ప్రొటీన్ ఉంటుంది.