Second Wife Pension: రెండో భార్యకు వితంతువు పించను ఇవ్వడంపై హైకోర్టు

వితంతువు పించను తనకు దక్కాలంటూ హైకోర్టు మెట్లెక్కిన చనిపోయిన వ్యక్తి రెండో భార్యకు షాకింగ్ తీర్పు వచ్చింది. జస్టిసెస్ ఎస్జే కథవాల్లా, మిలింద్ జాధవ్ ఈ మేరకు పిటిషన్ ను డిస్‌మిస్...

Second Wife Pension: రెండో భార్యకు వితంతువు పించను ఇవ్వడంపై హైకోర్టు

Pension

Second Wife Pension: వితంతువు పించను తనకు దక్కాలంటూ హైకోర్టు మెట్లెక్కిన చనిపోయిన వ్యక్తి రెండో భార్యకు షాకింగ్ తీర్పు వచ్చింది. జస్టిసెస్ ఎస్జే కథవాల్లా, మిలింద్ జాధవ్ ఈ మేరకు పిటిషన్ ను డిస్‌మిస్ చేశారు. సోలాపూర్ కు చెందిన షామల్ టాటె పెన్షన్ బెనిఫిట్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేసింది.

సోలాపూర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో పనిచేసిన ప్యూన్ మహదె రెండో భార్యనే టాటె. 1996లో మహదె మృతి చెందినప్పటికీ అతనికి రెండో వివాహమైంది. అతని మరణం తర్వాత మొదటి భార్య రెండో భార్యతో అగ్రిమెంట్ చేసుకుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తనకే 90శాతం దక్కాలని అందులో పేర్కొంది.

కొన్నేళ్లకు ఆమె కూడా క్యాన్సర్ తో మృతి చెందింది. ఆ తర్వాత టాటె రాష్ట్ర ప్రభుత్వాన్ని వితంతువు పించన్ తనకు ఇవ్వమని కోరుతూ అప్లికేషన్ పెట్టుకుంది. అలా నాలుగుసార్లు ప్రయత్నించినా ప్రభుత్వం నుంచి ఒకే సమాధానం వచ్చింది. 2007 నుంచి 2014వరకూ ప్రయత్నించిన ఆమె.. 2019లో హైకోర్టును ఆశ్రయించింది.

Read Also : భార్యకు ఇష్టముంటేనే ఉంటుంది..కలిసి ఉండాలని ఒత్తిడి చేయకూడదు : హైకోర్టు కీలక తీర్పు

మహదె ముగ్గురు పిల్లలకు తల్లిని, సొసైటీలో మహదె భార్యగా గుర్తింపు ఉన్న నేను పించను తీసుకోవడానికి అర్హురాలిని. ప్రత్యేకించి ఇన్నేళ్లు పించను తీసుకున్న మొదటి భార్య కూడా చనిపోయిందని పిటిషన్ లో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్థిస్తూ.. చనిపోయిన వ్యక్తితో లీగల్ వివాహం కాకపోతే ఎటువంటి హక్కులు ఉండవని చెప్పింది.