Bat Behind The Stumps: వికెట్ల వెనకాల కూడా బ్యాటింగ్ చేయొచ్చా.. ఈ వీడియో చూడండి!

బ్యాట్స్‌మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? లేదా..! అయితే ఈ వీడియో చూడండి. తాజాగా ఒక బ్యాట్స్‌మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేశాడు. ఇలా చేసినా తప్పు కాదంటున్నారు నిపుణులు.

Bat Behind The Stumps: వికెట్ల వెనకాల కూడా బ్యాటింగ్ చేయొచ్చా.. ఈ వీడియో చూడండి!

Bat Behind The Stumps: సాధారణంగా క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ వికెట్ల ముందు ఉండి బ్యాటింగ్ చేస్తాడు. కీపర్ వికెట్ల వెనకాల ఉంటాడు. అయితే, ఇదే రూలా? అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే వికెట్ల వెనకాల ఉండి కూడా బ్యాటింగ్ చేయొచ్చు.

Rahul Gandhi: ‘కేజీఎఫ్-2’ పాట వాడుకున్నందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు… ఫిర్యాదు చేసిన ఆడియో సంస్థ

పలుసార్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచుల్లో ఇలా బ్యాట్స్‌మెన్.. వికెట్ల ముందు ఉండి బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఇండియన్ క్లబ్ క్రికెట్ మ్యాచులో ఒక బ్యాట్స్‌మెన్ వికెట్ల వెనకాల నిలబడి బ్యాటింగ్ చేశాడు. అయితే, బౌలర్ బంతిని వేయగానే.. మళ్లీ వికెట్ల ముందుకొచ్చి ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. ముందుగా వికెట్ల వెనకాల నిలబడి.. ఆ తర్వాత ముందుకొచ్చి సిక్స్ కొట్టిన అతడి బ్యాటింగ్ శైలి అద్భుతం అనే చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిబంధనల ప్రకారం అయితే ఇలా కూడా బ్యాటింగ్ చేయొచ్చు. అయితే, వికెట్ల వెనకాల బ్యాటింగ్ చేయడం వల్ల వికెట్ కీపర్‌కు అడ్డుగా ఉండే అవకాశం ఉంది. దీనిపై వికెట్ కీపర్ ఫిర్యాదు చేస్తే బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌గా ప్రకటించే ఛాన్స్ ఉంది.

AP CM YS Jagan: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళకు ఏపీ సీఎం అండ.. సాయం అందించేందుకు హామీ!

వికెట్ల వెనకాల ఆడే అవకాశం ఉన్నప్పటికీ, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో బ్యాట్స్‌మెన్ ఎవరూ ఇలా ఆడేందుకు ఇష్టపడరు. పైగా క్రికెట్‌ను ‘జెంటిల్‌మెన్ గేమ్’ అని కూడా అంటారు. అందువల్ల బ్యాట్స్‌మెన్ ఇలాంటి ఛాన్స్ తీసుకోరు. ఇక అంతర్జాతీయ స్థాయిలోనూ అప్పుడప్పుడూ ఇలా బ్యాట్స్‌మెన్ వికెట్ల వెనకాల ఆడిన సందర్భాలున్నాయి. 2005లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బ్రాడ్ హడిన్ ఇలా వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.