Actress Aindrila Sharma Dies : సినీ పరిశ్రమలో మరో విషాదం.. 24ఏళ్లకే గుండెపోటుతో యువ నటి మృతి

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మరో యువ నటి గుండెపోటు కన్నుమూసింది. బెంగాలి నటి ఆండ్రిలా శర్మ కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం మరణించింది.

Actress Aindrila Sharma Dies : సినీ పరిశ్రమలో మరో విషాదం.. 24ఏళ్లకే గుండెపోటుతో యువ నటి మృతి

Actress Aindrila Sharma Dies : సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మరో యువ నటి గుండెపోటు కన్నుమూసింది. బెంగాలి నటి ఆండ్రిలా శర్మ కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం మరణించింది. ఆమె వయసు 24ఏళ్లే. చిన్న వయసులోనే గుండెపోటుతో ఆండ్రియా చనిపోవడం అందరినీ కలచివేస్తోంది.

బ్రెయిన్ స్ట్రోక్ తో ఈ నెల 1న ఆసుపత్రిలో చేరిన ఆండ్రిలా ఆదివారం తుది శ్వాస విడిచింది. పలుమార్లు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందింది. యువ నటి ఆండ్రిలా మృతితో ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. కాగా, సినీ పరిశ్రమలో ఇటీవలి కాలంలో ఎక్కువమంది కార్డియాక్‌ అరెస్ట్‌తో మరణించడం చర్చనీయాంశంగా మారింది.

పలుమార్లు గుండెపోటు రావడం, సర్జరీ చేసి ఉండటం, బ్రెయిన్ స్ట్రోక్.. ఆండ్రిలా మృతికి కారణాలుగా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ లోని బెర్హం పూర్ లో జన్మించిన ఆండ్రిలా.. జమూర్ తో టెలివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహాపీట్ తారపీట్, జిబోనే జ్యోతి, జియోన్ కతి వంటి షోలతో పాటు అమీ దీదీ నెంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లోను నటించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆండ్రిలా కొన్నాళ్ల క్రితం రెండు క్యాన్సర్లతో పోరాడి గెలిచింది. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో నవంబర్ 1న ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పైనే ఆమెకు చికిత్స అందించారు డాక్టర్లు. ఆ సమయంలో ఆమె పలుమార్లు కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైంది. ఆదివారం మరోసారి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురవడంతో తుదిశ్వాస విడిచింది.

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ తో సహా అన్ని ఇండస్ట్రీలలో 2022 ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.