టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిన సాగర్ ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక

నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అధిష్టానం.. మరో రెండు మూడు రోజులుల్లో బీసీ క్యాండిడేట్‌ను ఫైనల్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిన సాగర్  ఉపఎన్నిక అభ్యర్ధి ఎంపిక

candidate selection is headache of trs party for nagarjunasagar bypoll :  నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్‌.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అధిష్టానం.. మరో రెండు మూడు రోజులుల్లో బీసీ క్యాండిడేట్‌ను ఫైనల్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి తో ఖాళీ అయిన నాగార్జున సాగర్‌లో.. ఉప ఎన్నిక అభ్యర్థి విషయం అధికార పార్టీ టిఆర్ఎస్‌కి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. నర్సింహాయ్య కుమారుడు భగత్‌కు స్థానికత అంశం అడ్డుగా మారడంతో.. మరో బీసీ నేతను రంగంలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రాజుకోగా.. అన్ని పార్టీల నేతలు పర్యటనలతో కార్యకర్తల్లో హుషారు పెంచుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో నిలువగా.. అధికార టీఆర్ఎస్ నుంచి మరో రెండుమూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.

దుబ్బాక, జీహెఎంసీ ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలు తగలడంతో డీలాపడ్డ కార్యకర్తలకు.. హాలియాలో సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ కాస్త బూష్ట్ ఇచ్చింది. ఇదే క్రమంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికను సొంతం చేసుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎవరికి టిక్కెట్ ఇచ్చినా విక్టరీ కొట్టాలని అధిష్టానం కూడా అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి ఫైనల్ కాకముందే గులాబీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఎమ్మెల్యే సీటును నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ ఆశిస్తుండగా.. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితో పాటు స్థానిక బీసీ నేతలు కూడా సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గతంలో నర్సింహయ్యకు స్థానికుడు కాకపోయినా అధిష్టానం ఆదేశం వల్ల సీటును త్యాగం చేశామని.. ఈసారి తమకు సీటు ఇవ్వాల్సిందేనని కొందరు నేతలు తేల్చి చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి బరిలోకి దిగడంతో.. ఆయనపై గెలిచే గెలుపు గుర్రం కోసం పార్టీ సర్వేలు, అభిప్రాయ సేకరణలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరోసారి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. సర్వేలోను, అభిప్రాయ సేకరణలోనూ స్థానికుడైన బీసీ నేతకు అవకాశం ఇవ్వాలని మెజార్టీ అభిప్రాయం వచ్చినట్లు సమాచారం. జానారెడ్డిని ఢీకొట్టే బలమైన బీసీ నేతను రంగంలోకి దింపాలని భావిస్తోంది.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరన్నదానిపై రెండుమూడు రోజుల్లో స్పష్టత రానున్నది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో నేతలంతా మండలాల వారీగా క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. మండలాల వారీగా ప్రత్యేక ఇంచార్జీలను కూడా నియమించే పనిలో గులాబీ నేతలు ఉన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. తమ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు.

అభ్యర్థిగా పార్టీ ఎవరిని నిర్ణయించినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న కసితో క్యాడర్‌ ఉన్నట్టు నల్లగొండ టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.అయితే నోముల నర్సింహయ్య వారసుడిగా భగత్ కు టికెట్ కేటాయించాలన్న డిమాండ్ ను నోముల అభిమానులు ముందుకు తెస్తున్నారు. నోములకు లేని స్థానికత అంశం ఇప్పుడు ఆయన తనయుడుకు అపాదించడం సమంజసం కాదని వాదిస్తున్నారు. మొత్తానికి అతి త్వరలోనే గులాబీ అభ్యర్థి ఎవరో తేలిపోనుంది.