Bajaj Qute : ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం..భాగ్యనగర్ వాసులకు త్వరలో అందుబాటులోకి

ఆటో ఛార్జీలకే సౌకర్యవంతంగా గమ్యస్ధానాలకు చేర్చటంతోపాటు, ఇందులో ప్రయాణం భద్రతతో కూడుకున్నదిగా ఉండటంతో బెంగుళూరులో ఎక్కవ మంది దీనిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Bajaj Qute : ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం..భాగ్యనగర్ వాసులకు త్వరలో అందుబాటులోకి

Bajaj Qute (1)

Bajaj qute : బజాజ్ ఆటో, ఉబర్ సంస్ధలు సంయుక్తంగా కలసి హైద్రబాద్ లో ప్రయాణికుల రవాణా కోసం సరికొత్త సర్వీసును తీసుకురానున్నాయి. బజాజ్ ఆటో క్యూట్ పేరుతో క్వాడ్రి సైకిల్ ని రూపొందించింది. నలుగురు మాత్రమే పట్టే ఈ బుల్లికారులో ఏంచక్కా ఆటో కంటే సౌకర్యవంతంగా సిటీలో గమ్యస్ధానాలకు చేరేందుకు వీలుంటుంది. నాలుగు చక్రాలతో నడిచే ఈ క్వాడ్రి కారును బజాజ్ చాలా కాలం క్రితమే తయారు చేసింది. దేశంలోని కేరళ,గుజరాత్, మహరాష్ట్రల్లో ప్రయోగాత్మకంగా ఈ మెడళ్ళను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఉబర్, బజాజ్ లు జతకట్టి బెంగుళూరు నగరంలో ఈ క్యూట్ కారు సేవలను అందిస్తున్నారు.

ఆటో ఛార్జీలకే సౌకర్యవంతంగా గమ్యస్ధానాలకు చేర్చటంతోపాటు, ఇందులో ప్రయాణం భద్రతతో కూడుకున్నదిగా ఉండటంతో బెంగుళూరులో ఎక్కవ మంది దీనిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అక్కడ ఈ సర్వీసులకు మంచి ప్రాచుర్యం ఏర్పడింది. బెంగుళూరు నగరంలో సక్సెస్ కావటంతో ఈ సేవలను మరికొన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించారు.

త్వరలో హైద్రాబాద్ లో క్వాడ్రి సేవలు..

ఈ క్రమంలోనే క్వాడ్రి క్యూట్ కార్ల తయారీపై బజాజ్ సంస్ధ దృష్టిపెట్టింది. ఉబర్ సంస్ధ ఆధ్వర్యంలో ఈ ఏడాది చివరి నాటికి హైద్రాబాద్ నగరంలో సైతం ఈ క్యూట్ కారు సర్వీసులు ప్రారంభంకానున్నాయి. అతితక్కువ ఛార్జీలతోపాటు, సౌకర్యవంతమైన ప్రయాణం ఈ క్వాడ్రి క్యూట్ కారులో ఉండటంతో తప్పకుండా ప్రయాణికులు ఆదరిస్తారని బజాజ్, ఉబర్ సంస్ధలు బావిస్తున్నాయి.