Casino: క్యాసినోకు ఏర్పాట్లు.. పోలీసుల అనుమతి నిరాకరణ Casino IN krishna district stopped due to police deny permission

Casino: క్యాసినోకు ఏర్పాట్లు.. పోలీసుల అనుమతి నిరాకరణ

కంపెనీ ప్రమోషన్ కోసం క్యాసినో నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి నిర్వాహకులు మద్యం సరఫరా చేసేందుకు అనుమతులు తీసుకున్నారు. అయితే, ఈ విషయం కార్యక్రమం జరిగే హోటల్ యాజమాన్యానికి క్యాసినో నిర్వాహకులు తెలియజేయలేదు.

Casino: క్యాసినోకు ఏర్పాట్లు.. పోలీసుల అనుమతి నిరాకరణ

Casino: కృష్ణాజిల్లా కంకిపాడులో క్యాసినో నిర్వహణ వ్యవహారం సంచలనం రేపింది. కంపెనీ ప్రమోషన్ కోసం క్యాసినో నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి నిర్వాహకులు మద్యం సరఫరా చేసేందుకు అనుమతులు తీసుకున్నారు. అయితే, ఈ విషయం కార్యక్రమం జరిగే హోటల్ యాజమాన్యానికి క్యాసినో నిర్వాహకులు తెలియజేయలేదు. మరోవైపు క్యాసినో ఆడేందుకు రావాలంటూ పెద్ద ఎత్తున పాంప్లెట్లు పంచి ప్రచారం చేశారు. క్యాసినో ఆడేందుకు వచ్చే వారికి వినోదాన్ని అందించడమే కాకుండా, మహిళలతో డాన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని పాంప్లెట్లో ప్రచారం చేశారు.

Sonia Gandhi: ఈడీ విచారణకు దూరంగా సోనియా గాంధీ

అయితే, క్యాసినోలో మద్యంతోపాటు డాన్సులు, విందులు, వినోదాలు వంటివి చేసుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని హోటల్ యాజమాన్యం సూచించింది. కాగా, క్యాసినో నిర్వహణకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ రోజ జరగాల్సిన క్యాసినో కార్యక్రమం రద్దు అయింది.

×