DHFL: 34 వేల కోట్ల మోసం.. డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై సీబీఐ కేసు

బ్యాంకు మోసాలకు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు నమోదు చేసిన అతిపెద్ద మోసపు కేసు ఇదే. ఇంతకుముందు సీబీఐ నమోదు చేసిన అత్యంత విలువ కలిగిన బ్యాంకు కేసు ఏబీజీ షిప్‌యార్డుకు సంబంధించింది. రూ.22,842 కోట్ల మోసం గురించి ఈ కేసు నమోదైంది.

DHFL: 34 వేల కోట్ల మోసం.. డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై సీబీఐ కేసు

Dhfl

DHFL: బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలతో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వదవాన్, కపిల్ వదవాన్‌లపై బుధవారం కేసులు నమోదు చేసింది.

TTD: ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు

బ్యాంకు మోసాలకు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు నమోదు చేసిన అతిపెద్ద మోసపు కేసు ఇదే. ఇంతకుముందు సీబీఐ నమోదు చేసిన అత్యంత విలువ కలిగిన బ్యాంకు కేసు ఏబీజీ షిప్‌యార్డుకు సంబంధించింది. రూ.22,842 కోట్ల మోసం గురించి ఈ కేసు నమోదైంది. అయితే, తాజాగా డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ అంతకుమించి మోసం చేసిందన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ముంబైలోని 12 చోట్ల 50 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసు వివరాల్ని పరిశీలిస్తే 2010-2018 వరకు ఎనిమిదేళ్ల కాలంలో యూనియన్ బ్యాంకు కన్సార్టియం నుంచి దాదాపు రూ.42,871 కోట్ల రుణాలు సమకూర్చింది.

Ketaki Chitale: 40 రోజులుగా జైల్లోనే నటి.. బెయిల్ మంజూరు

అయితే, 2019 నుంచి చెల్లింపులు చేయడం లేదని యూనియన్ బ్యాంకు సీబీఐకి 2021లో లేఖ రాసింది. తాము కేపీఎంజీ అనే సంస్థతో ఆడిట్ జరిపినప్పుడు కంపెనీ వివిధ మోసాలకు పాల్పడ్డ విషయం వెల్లడైందని బ్యాంకు తెలిపింది. దీనిపై సీబీఐ తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో నిందితులుగా గుర్తించిన సంస్థ మాజీ ప్రమోటర్లు ఇద్దరూ ఇప్పటికే మరో బ్యాంకును మోసం చేసిన కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.