Viveka Murder: సీబీఐ ఆధారాల వేట.. 10వ రోజు కొనసాగుతున్న విచారణ!

మాజీ ఎంపీ, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఆధారాల వేట కొనసాగుతుంది. గత తొమ్మిది రోజులుగా సీబీఐ అధికారులు కడప జిల్లా కేంద్రంగా విచారణ కొనసాగించగా నేడు 10వ రోజు విచారణ కొనసాగుతోంది.

Viveka Murder: సీబీఐ ఆధారాల వేట.. 10వ రోజు కొనసాగుతున్న విచారణ!

Viveka Murder

Viveka Murder: మాజీ ఎంపీ, సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఆధారాల వేట కొనసాగుతుంది. గత తొమ్మిది రోజులుగా సీబీఐ అధికారులు కడప జిల్లా కేంద్రంగా విచారణ కొనసాగించగా నేడు 10వ రోజు విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ చేపట్టగా బుధవారం చిట్వేలి మండలానికి చెందిన వైసీపీ నాయకులు లక్ష్మీకర్‌, రమణను అధికారులు ప్రశ్నించారు.

ఈ ఇద్దరూ వివేకాతో అత్యంత సన్నిహితంగా ఉండేవారని సీబీఐ విచారణలో తేలడంతో గతంలోనూ వీరిని విచారించినట్లు సమాచారం. ఆ ఇద్దరితో పాటు సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన జగదీశ్వర్ రెడ్డినీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జగదీశ్వర్ గతంలో వివేకా దగ్గర పీఏగా పనిచేసినట్లు సమాచారంతోనే ఆయనను విచారిస్తున్నారు.

2019 మార్చి నెలలో వివేకానందరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా రెండేళ్లు దాటినా ఇంకా హంతకులను గుర్తించలేదు. ఈ విషయమై నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై వివేకా కుమార్తె సునీత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు వినతిపత్రం సమర్పించగా పలు కీలక ఆధారాలను కూడా అందించారని కథనాలొచ్చాయి.