CBI Raids: నా కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) నిన్న తన ఇంట్లో చేపట్టిన సోదాలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. తన ఇంట్లో గంటల పాటు సోదాలు జరిపిన సీబీఐ అధికారులు తన కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తాను, తన కుటుంబ సభ్యులు సీబీఐ అధికారుల విచారణకు సహకరించామని అన్నారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. తాము ఏ అవినీతికీ పాల్పడలేదని, ఏ తప్పూ చేయలేదని చెప్పారు. తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీబీఐకి దుర్వినియోగం చేస్తున్నారని తమకు తెలుసని చెప్పారు.

CBI Raids: నా కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

CBI Raids

CBI Raids: ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) నిన్న తన ఇంట్లో చేపట్టిన సోదాలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. తన ఇంట్లో 14 గంటల పాటు సోదాలు జరిపిన సీబీఐ అధికారులు తన కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తాను, తన కుటుంబ సభ్యులు సీబీఐ అధికారుల విచారణకు సహకరించామని అన్నారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. తాము ఏ అవినీతికీ పాల్పడలేదని, ఏ తప్పూ చేయలేదని చెప్పారు. తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీబీఐకి దుర్వినియోగం చేస్తున్నారని తమకు తెలుసని చెప్పారు.

కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్ లో సిసోడియా(ఏ1)తో పాటు మరో మంది పేర్లను నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న మొత్తం దాదాపు 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది. మరోవైపు ఇప్పటికే న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మ‌నీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్ర‌భుత్వం అరెస్టు చేయించే అవ‌కాశం ఉంద‌ని అర‌వింద్ కేజ్రీవాల్ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలు పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

China-taiwan conflict: తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలు