మే-4 నుంచి సీబీఎస్ఈ 10,12తరగతుల ఎగ్జామ్స్

మే-4 నుంచి సీబీఎస్ఈ 10,12తరగతుల ఎగ్జామ్స్

CBSE విద్యార్థులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్​ ని ఇవాళ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్ విడుదల చేశారు. పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి. జూన్-7న 10వ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. జూన్-11న 12వ తరగతి పరీక్షలు ముగియనున్నాయి. ఇక,వర్తించిన సబ్జెక్టులకు మార్చి-1నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

10వ తరగతి పరీక్షలు ఉదయం 10:30 గంటల నుంచి మద్యాహ్నాం 1:30 గంటల వరకు జరుగనున్నాయి. 12వ తరగతి రెండు షిఫ్ట్ లలో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 10:30గంటల నుంచి 1:30గంటల వరకు..రెండో షిఫ్ట్ మధ్యాహ్నాం 2:30గంటల నుంచి 5:30గంటల వరకు జరుగనున్నాయి.

2021లో బోర్డు పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించట్లేదని విద్యాశాఖ సృష్టం చేసింది. పరీక్షలన్నీ రాతపూర్వక విధానంలోనే జరుగుతాయని తెలిపింది. సాధారణంగా ఏటా జనవరిలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్..ఫిబ్రవరిలో రాత పరీక్షలు మొదలై మార్చిలో ముగిసేవి. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది.