CCC : మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. ‘సిసిసి’ ఆధ్వర్యంలో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా వ్యాక్సిన్..

కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీని ద్వారా వేలాదిమంది సినీ జనాలకు సాయమందించారు చిరు.. మెగాస్టార్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నంలో సినీ ప్రముఖులంతా కూడా పాలుపంచుకున్నారు..

CCC : మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. ‘సిసిసి’ ఆధ్వర్యంలో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా వ్యాక్సిన్..

Ccc

CCC: కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో క‌రోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీని ద్వారా వేలాదిమంది సినీ జనాలకు సాయమందించారు చిరు.. మెగాస్టార్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నంలో సినీ ప్రముఖులంతా కూడా పాలుపంచుకున్నారు..

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృత కొనసాగుతన్న నేపథ్యంలో మరోసారి సినిమా పరిశ్రమకు కష్టకాలం తప్పడం లేదు.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.. ఈ సందర్భంగా అభినందనీయమైన నిర్ణయం తీసుకుని చిరు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..

‘‘తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) తరుపున ఉచితంగా అందరికి వ్యాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone. #GetVaccinated
#WearMask #StaySafe’’ అంటూ చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.