Uttara Pradesh : స్కూలు విద్యార్ధినిని వేధించిన యువకుడు.. సీసీ ఫుటేజ్ వైరల్

ఈవ్ టీజర్ల అరాచకాలకు అడ్డు ఉండట్లేదు. రోజూ ఏదో ఒక చోట బాలికల్ని ఇబ్బంది పెడుతున్న సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ మథురలో ఓ స్కూల్ విద్యార్ధినిని ఆకతాయి వేధిస్తున్న వీడియో బయటకు వచ్చింది.

Uttara Pradesh : స్కూలు విద్యార్ధినిని వేధించిన యువకుడు.. సీసీ ఫుటేజ్ వైరల్

Uttara Pradesh

Uttara Pradesh : బాలికలపై ఈవ్ టీజర్ల ఆగడాలు మితి మీరుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ యువకుడు స్కూలు విద్యార్ధినిని వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Uttar Pradesh : యూపీ ప్రభుత్వ స్కూల్ లో 18మంది బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు

స్కూలుకి వెళ్తున్న ఓ విద్యార్ధినిని ఆకతాయి అడ్డగించాడు. చేతులు పట్టుకుని ఇబ్బందికి పెట్టాడు. అక్కడి నుంచి వెళ్లనీయకుండా ఆపి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఉత్తరప్రదేశ్ థానా రాయప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడ్డ వ్యక్తి మాక్రోల్ అనే గ్రామానికి చెందిన బిష్ణు అనే వ్యక్తిగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో అటువైపు వెళ్తున్న ఎవరూ ఆకతాయిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సీసీ ఫుటేజ్ లో రికార్డైన వీడియో  వైరల్ కావడంతో బాలిక తల్లి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి యువకుడిపై ఫిర్యాదు చేసింది.

Uttarakhand : ప్రేమ వేధింపులు .. మహిళా న్యాయవాది ముక్కు కొరికేసిన సీనియర్ లాయర్

త్వరగా నిందితుడిని పట్టుకుని అతనిపై చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయనట్లుగా తెలుస్తోంది.