CCTVs in spas : మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీలా? మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీ ఏర్పాటు చేయడం గురించి మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

CCTVs in spas : మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీలా? మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Cctvs In Spas (1)

CCTVs in spas violate right to ‘bodily’ privacy : మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీ ఏర్పాటు చేయడం గురించి మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలోని న్యాయమూర్తుల మదురై బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. మసాజ్‌ సెంటర్‌లో సీసీటీవీ ఏర్పాటు చేయడం అంటే వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించడమేనని మద్రాస్‌ హైకోర్టు స్పష్టంచేసింది. మంగళవారం (జనవరి 4,2022) ఓ కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Read more : Hyderabad : హోటల్‌ లో లేడీస్ బాత్రూములో సీక్రెట్ కెమెరా

మసాజ్ సెంటర్ లో సీసీటీవీ ఏర్పాటు చేయటానికి యత్నిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ని ఉల్లంఘించినట్లేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఓ వ్యక్తి గోప్యతకు భంగం కలిగిస్తూ సీసీటీవీ ఏర్పాటు చేయాలంటే దానికి అత్యంత బలమైన కారణం ఉండాలని..హైకోర్టు స్పష్టం చేసింది.

మసాజ్‌ సెంటర్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో క్వీన్ ఆయుర్వేదిక్ క్రాస్ స్పా సెంటర్ పేరుతో స్పా యజమాని చేస్తున్న ప్రయత్నాలను తిరుచిరాపల్లి పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై యజమాని పాయెల్ బిస్వాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ ఇప్పిస్తూ తిరుచిరాపల్లి పోలీసులకు ఆదేశించాలని పిటిషనులో పేర్కొన్నారు. పోలీసు చర్యను సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Read more : Cameras in women bathroom : బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన 57 ఏళ్ల వ్యక్తి..జైలు శిక్ష వేసిన కోర్టు

ఈ కేసు విచారణ సందర్భంగా..ప్రభుత్వ న్యాయవాది వాదనలు చేస్తున్న క్రమంలో న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణ్యం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించే ఉద్దేశ్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్పాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు తెలియజేశారు. దానికి జస్టిస్ స్వామినాథన్ మాట్లాడుతూ..జస్టిస్ సుబ్రమణ్యం ఆదేశాల గోప్యతపై సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని అన్నారు.